అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై సమీక్ష చేశారు. వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలలో వేసవిలో సరఫరాకు డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ లభ్యత తగినంత పరిమాణంలో ఉందని సీఎస్ కలెక్టర్లకు తెలిపారు.
జనగామ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను తిట్టి సీఎం అయితే.. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని తిట్టి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవానికి సిద్ధం అవుతుంది.. రేపటి నుండి (బుధవారం) 23వ తేదీ వరకు పంచకుండాత్మక నృసింహ మహా యాగం జరిపించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేయనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు శ్రీ మధుర కవి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ క్రతువును నిర్వహించనున్నారు.
పాపన్నపేట (మం) బాచారం గ్రామానికి చెందిన భర్త ఆశయ్య (55).. ఈ నెల 15న పొలం పనులకు వెళ్లి కాలు జారి పడ్డాడు. అయితే అతని కాలు, నడుముకు గాయమై నడవలేని స్థితిలో ఉన్నాడు. అయితే భర్త ఆరోగ్యం కుదుటపడటానికి ఆస్పత్రికి డబ్బులు ఖర్చు అవుతాయని భావించిన భార్య శివమ్మ.. తన అల్లుడితో కలిసి భర్తను చంపేసింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు కలిశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావాల్సిన బడ్జెట్‌ను తయారు చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. తెలంగాణ విద్యా కమిషన్ విద్యా రంగంలోని వివిధ వర్గాలతో వరుస చర్చలు జరిపి వారి నుండి అనేకమైన సలహాలు సూచనలు తీసుకున్నట్లు విద్యా కమిషన్ తెలిపింది.
జేఎన్‌టీయూహెచ్ కొత్త వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ కె. విజయకుమార్ రెడ్డి (డైరెక్టర్), డాక్టర్ కె. వెంకటేశ్వరరావు (రిజిస్ట్రార్), వివిధ విభాగాల డైరెక్టర్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని తెలిపారు. అలాగే.. ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. పంటల రక్షణ కోసం కొత్త స్కీం తీసుకురానుంది. దీంతో పాటు.. రైతుల అవసరాలకు సంబంధించిన పరికరాలను అందించే యోచనలో సర్కార్ ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది.. వందల మంది ప్రాణాల త్యాగం లేదా..? అని ప్రశ్నించారు. రాజకీయంగా దెబ్బతింటాం అని తెలిసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర వాళ్లకు ఉందని అన్నారు.
శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కేటీఆర్ రైతు దీక్షపై కౌంటర్ ఎటాక్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.