డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇంట్లో వాళ్లు, బయటి వాళ్లని సంబంధం లేకుండా కాసుల కోసం కక్కుర్తిపడి హత మారుస్తున్నారు. తాజాగా.. సొంత బావనే బామ్మర్ది హత్య చేసిన సంఘటనను పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్ఐసీ డబ్బుల కోసమని ఆశపడి బావనే బామ్మర్ది మర్డర్ చేశాడు. కాగా.. ఈ మర్డర్ కేసును అమీన్‌పూర్ పోలీసులు 24 గంటల్లో చేధించారు. బీమా డబ్బులు కోసమే సొంత బావను బావమరిది హత్య చేసినట్లుగా గుర్తించారు. గోపాల్ నాయక్‌ను అతని బామ్మర్ది నరేష్, మేనమామ దేవి సింగ్‌లు హత్య చేసినట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో.. నిందితులు నరేష్, దేవీసింగ్‌లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు పోలీసులు.
Read Also: Bandi Sanjay : ఐఏఎస్‌లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా..?
గతేడాది గోపాల్ నాయక్ పేరు పై బ్యాంకు లోన్‌తో నరేష్ జేసీబీ కొనుగోలు చేశాడు. కాగా.. రిస్క్ ఇన్సూరెన్స్‌తో పాటు ఎల్ఐసీ చేయించాడు నిందితుడ నరేష్.. అయితే గత కొద్ది రోజులుగా జేసీబీ నడవక పోవడంతో నరేష్ అప్పులు చేశాడు. అయితే ఆ అప్పులు తీర్చేందుకు నరేష్ ఓ ప్లాన్ వేశాడు. తన బావ గోపాల్‌ను హత్య చేస్తే ఎల్ఐసీ డబ్బులు వస్తున్నాయని భావించాడు. మద్యం తాగుదామని గోపాల్‌ను పిలిపించి.. దేవీ సింగ్‌తో కలిసి చున్నీతో ఉరివేసి హత్య చేశారు. కాగా.. గోపాల్‌ది సాధారణ మృతిగా నమ్మించే యత్నం చేశాడు నరేష్. అయితే.. అమీన్‌పూర్ పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. డబ్బుల కోసం చంపి ఎంజాయ్ చేద్దామనుకున్న నిందితుడు నరేష్.. ఇప్పుడు జైల్లో కటకటాల పాలయ్యాడు.
Read Also: Vallabhaneni Vamsi: హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్.. నన్ను ఇరికించే ప్రయత్నం..!