గుండెపోటు మరణాలతో రోజు ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. చాలా మంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. రోజుకు కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోతున్న సంఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ వరుడు గుర్రంపై కూర్చుని ఉండగానే చనిపోయాడు.. అలాగే కొందరు డ్యాన్స్ చేస్తూ, సినిమా చేస్తూ, వాకింగ్ చేస్తూ.. ఇలా చాలా సందర్భాలలో గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టులో ఓ సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించాడు.
Read Also: Aprilia Tuono 457: ఇటాలియన్‌కు చెందిన 457 సీసీ స్పోర్ట్ బైక్ విడుదల.. ధర తక్కువే!
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరుఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో లాయర్ వేణుగోపాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే లోపే మార్గమధ్యలో న్యాయవాది వేణుగోపాల్ రావు మృతి చెందాడు. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులో అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపి వేశారు జడ్జిలు. మరోవైపు.. అన్ని కోర్టులలో విచారణలు రేపటికి వాయిదా వేశారు న్యాయమూర్తులు.
Read Also: Eatala Rajendar: హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది..