Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి
- మహీంద్రా నుంచి మహీంద్రా BE6 అనే కొత్త ఎలక్ట్రిక్ SUV
- టాప్ వేరియంట్ ప్యాక్ 3లో చాలా ఫీచర్లు
- టాప్ వేరియంట్ ప్యాక్ 3 ధర రూ.26.90 లక్షలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ప్రసిద్ధ SUVల తయారీదారు అయిన మహీంద్రా.. మహీంద్రా BE6 అనే కొత్త ఎలక్ట్రిక్ SUVని ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని టాప్ వేరియంట్ ప్యాక్ 3లో వివిధ రకాల ఫీచర్లతో వస్తుంది. ఈ కారును కొనుగోలు చేయడం మంచిదేనా.. కాదా అనే వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా ఇటీవలే ఎలక్ట్రిక్ SUVగా BE6 ను విడుదల చేసింది. ఈ వాహనం కోసం బుకింగ్‌లు ఫిబ్రవరి 14, 2025న ప్రారంభమయ్యాయి. కాగా.. టాప్ వేరియంట్ ప్యాక్ 3లో అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ, మోటారు కలిగి ఉంది. ఈ కారు పర్యావరణానికి గొప్ప ఎంపికగా నిలిచింది.
Read Also: America : అమెరికాలో ఆ డిపార్ట్ మెంట్లో ఉద్యోగం అంటేనే వణుకుతున్న ప్రజలు
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
బ్యాటరీ & మోటారు:
BE6 యొక్క టాప్ వేరియంట్ ప్యాక్ 3.. 79 kWh బ్యాటరీతో అమర్చారు. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత MIDC (మోడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) శ్రేణి ప్రకారం 683 కి.మీ.ల అద్భుతమైన రేంజ్‌ని అందిస్తుంది. రేంజ్‌ని పెంచడానికి రీ ప్రొడక్షన్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా చేర్చారు. BE6లోని మోటార్ 210 kW శక్తిని, 380 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ SUV రేంజ్, ఎవ్రీడే, రేస్, స్నో, కస్టమ్ మోడ్‌ల వంటి మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్‌లతో కూడా వస్తుంది. ఇంకా మెరుగైన డ్రైవింగ్ సౌలభ్యం కోసం వెహికల్ సింగిల్-పెడల్ డ్రైవ్‌ను కలిగి ఉంది. మహీంద్రా BE6 కొలతల విషయానికొస్తే.. పొడవు 4371 mm, వెడల్పు 1907 mm.. ఎత్తు 1627 mmతో వస్తుంది. వీల్ బేస్ 2775 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 207 mm కలిగి ఉంది. బూట్ స్పేస్ 455 లీటర్లు, అదనంగా 45 లీటర్ల ముందు లగేజ్ స్పేస్ కూడా ఉంది.
ఫీచర్లు:
మహీంద్రా BE6 దాని టాప్ వేరియంట్‌లో అనేక రకాల ఫీచర్లను కలిగి ఉంది. LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్,
డ్రైనేజ్ రంధ్రం ఉన్న ఫ్రంక్, బ్రైట్ లోగో, సి-ఆకారపు LED DRLలు, టెయిల్ లాంప్స్, ORVM టర్న్ ఇండికేటర్లు, బ్యాక్ స్పాయిలర్, ఇన్ఫినిటీ ఫిక్స్‌డ్-గ్లాస్ పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ తో కూడిన ఫాబ్రిక్ సీట్లు, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్‌తో 15 హర్మాన్ కార్డాన్ స్పీకర్లు, విజన్ X, అలెక్సా ఇంటిగ్రేషన్, చాట్ జీపీటీ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, పుష్-బటన్ ప్రారంభం, 360-డిగ్రీ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటి అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది.
సెక్యూరిటీ ఫీచర్లు:
భద్రత కోసం ఈ కారులో సెక్యూరిటీ ఫీచర్ల విషయానికొస్తే.. ఏడు ఎయిర్‌బ్యాగులు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ISOFIX చైల్డ్ యాంకరేజ్‌లు, బ్లైండ్-స్పాట్ పర్యవేక్షణ, ముందు ఫాగ్ ల్యాంప్స్ మరియు పార్కింగ్ సెన్సార్లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు రివర్స్ కెమెరా, విండ్‌షీల్డ్ ఆటో డీఫాగింగ్ ఫీచర్లు ఉన్నాయి.
ధర & డెలివరీ:
మహీంద్రా BE6 యొక్క టాప్ వేరియంట్ ప్యాక్ 3 ధర రూ.26.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ వాహనం కోసం బుకింగ్‌లు ఫిబ్రవరి 14, 2025న ప్రారంభమయ్యాయి. డెలివరీలు మార్చి 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?