ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందు ఉంచింది. కాగా.. ఆరంభంలోనే ట్రెంట్ బౌల్ట్ 3 కీలక వికెట్ల తీసి శుభారంభాన్ని అందించాడు.
సండే వచ్చిందంటే చాలు ముక్కలేనిది ముద్ద దిగదు. అయితే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు చికెన్ తినాలన్న ఆశ తీరకుండానే ఉండిపోతుంది. మరోవైపు.. పెరిగిన ధరలు చూసి నాన్ వెజ్ ప్రియులు షాక్ అవుతున్నాయి.
ఇంగ్లండ్ వైట్ బాల్, ప్రస్తుత ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ తన పేరును మార్చుకున్నాడు. 'వాస్తవంగా నా పేరు జోస్ (JOS) బట్లర్. అయితే అందరూ జోష్ (JOSH) బట్లర్ అనే పిలుస్తున్నారు. ఆఖరికి మా అమ్మ కూడా ఇలానే పిలుస్తుంది. దీంతో.. 13 ఏళ్ల కెరీర్, 2 వరల్డ్ కప్ విజయాల తర్వాత ఇప్పుడు అధికారికంగా నా పేరును జోష్ బట్లర్ గా మార్చుకుంటున్నా' అని పేర్కొన్నారు. అందుకు సంబంధించి వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ Xలో షేర్ చేసింది.…
శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగుతోంది. అందులో భాగంగా.. బంగ్లాదేశ్ జట్టు కొంత విచిత్రంగా ప్రవరిస్తోంది. బౌండరీకి వెళ్తున్న బంతి వెనకాల ఐదుగురు ఫీల్డర్లు పరిగెత్తి ఆశ్చర్యానికి గురి చేశారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బంగ్లా ప్లేయర్లకు పిచ్చి ముదిరందా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ముంబై వాంఖడే వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే హోంగ్రౌండ్ లో జరిగే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ముంబై ఉంది. మరోవైపు.. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న రాజస్తాన్ కూడా.. మరో విజయంపై కన్నేసింది.
సోమవారం ఎన్నికల సంఘాన్ని పశ్చిమ బెంగాలు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా.. టీఎంసీ నేత పీయూష్ పాండాపై ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కోరింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన సమయంలో తన కులాన్ని ఉద్దేశించి పాండా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో.. రోజు ఢిల్లీలో ఈసీని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీని కలిసిన వారిలో కేంద్రమంత్రి హర్దీప్…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సోమవారం బిగ్ రిలీఫ్ లభించింది. ప్రభుత్వ ఖజానా (తోషాఖానా) అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ఇద్దరికీ 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. అందుకు నిదర్శనం.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ తీసిన వికెట్లే. ఆ మ్యాచ్లో పతిరణ యార్కర్లతో విరుచుకుపడ్డాడు. గంటకు 150 కి.మీ వేగంతో యార్కర్ బౌలింగ్ వేసి ఒకే ఓవర్ లో రెండు కీలక వికెట్లు తీశాడు. కళ్లు మూసి తెరిచేలోపు బంతి జట్ స్పీడ్ తో దూసుకుపోయింది. 15 ఓవర్లో పతిరణ వేసిన బౌలింగ్లో మిచెల్ మార్ష్, ట్రిస్టన్…
దేశంలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను(GST) రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వ్యాట్ స్థానంలో తీసుకురాబడిన జీఎస్టీ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును కనబరుస్తోంది. మార్చిలో రూ. 1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.5 శాతం ఎక్కువ. ఇది ఇప్పటి వరకు రెండవ అత్యధిక వసూళ్లు కావటం గమనార్హం.
ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇస్లాంగర్ పట్టణంలోని బాణాసంచా గోదాములో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఇల్లు చెల్లాచెదురైంది. ప్రమాదం జరిగిన బాణసంచా గోదాము బిల్సీ రోడ్డులో ఉంది. అయితే.. ఈ ప్రమాదంలో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అందరు భావిస్తున్నారు.