శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగుతోంది. అందులో భాగంగా.. బంగ్లాదేశ్ జట్టు కొంత విచిత్రంగా ప్రవరిస్తోంది. బౌండరీకి వెళ్తున్న బంతి వెనకాల ఐదుగురు ఫీల్డర్లు పరిగెత్తి ఆశ్చర్యానికి గురి చేశారు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బంగ్లా ప్లేయర్లకు పిచ్చి ముదిరందా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకుముందు.. బ్యాట్ మధ్యలో తగిలిన దానిని బంగ్లాదేశ్ బ్యాటర్ రివ్యూ తీసుకొని మైండ్ బ్లాంక్ చేశాడు. అలాగే.. నిన్న లంక బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో ముగ్గురు ప్లేయర్లు ఒకేసారి జారవిడిచారు. ఈరోజు అంతకంటే ఎక్కువ నవ్వచ్చే పని చేసి అభిమానులకు నవ్వులు పూయించారు. క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి సన్నివేశం ఎప్పుడు కనిపించలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
MI vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ రాయల్స్..
శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ ఆడిన ఓ షాట్.. నాలుగో స్లిప్ లో ఉన్న ఫీల్డర్ ఎడమవైపు నుంచి బౌండరీ వైపు వెళ్తుంది. అయితే.. బంతిని పట్టుకోవడానికి, స్లిప్ లో నిలబడి ఉన్న నలుగురు ఫీల్డర్లతో పాటు పాయింట్ ఫీల్డర్ కూడా పరిగెత్తడం వీడియలో చూడొచ్చు. ఈ ఐదుగురు ఫీల్డర్లు పరిగెత్తడం చూస్తుంటే.. రేసులో పాల్గొన్నారా అన్నట్లు అనిపిస్తుంది.
మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు భారీ ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 531 పరుగులు చేయగా, ఆ తర్వాత బంగ్లాదేశ్ 178 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక ఫాలో ఆన్ చేయకపోవడంతో మళ్లీ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. శ్రీలంక 455 పరుగుల ఆధిక్యంలో ఉంది.
R̶e̶a̶l̶ ̶l̶i̶f̶e̶ ̶i̶n̶c̶i̶d̶e̶n̶t̶ ̶i̶n̶s̶p̶i̶r̶i̶n̶g̶ ̶a̶ ̶m̶o̶v̶i̶e̶
Movie inspiring a real-life incident 🎥
.
.#BANvSL #FanCode pic.twitter.com/1USI5EH9cV— FanCode (@FanCode) April 1, 2024