దేశంలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను(GST) రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. వ్యాట్ స్థానంలో తీసుకురాబడిన జీఎస్టీ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును కనబరుస్తోంది. మార్చిలో రూ. 1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.5 శాతం ఎక్కువ. ఇది ఇప్పటి వరకు రెండవ అత్యధిక వసూళ్లు కావటం గమనార్హం.
Read Also: Kejriwal: తీహార్ జైలుకు కేజ్రీవాల్ తరలింపు
గరిష్టంగా ఫిబ్రవరిలో 12.5 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీలో వృద్ధి (17.6%) నమోదు కావడం వల్ల కలెక్షన్లు పెరిగాయని కేంద్రం తెలిపింది. ఇదే క్రమంలో జీఎస్టీ రీఫండ్స్ రూ.1.65 లక్షల కోట్లుగా నిలిచాయి. FY24లో జీఎస్టీ కలెక్షన్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.7% పెరిగి రూ.20.14లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపింది.
Read Also: Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం.. భక్తులు సురక్షితం
ఈ ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నిలిచాయి. మునుపటి సంవత్సరం సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి నాటికి తిరిగి చెల్లింపుల GST రాబడి నికర రూ.18.01 లక్షల కోట్లు, ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 13.4% వృద్ధి.