రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కాగా.. వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 6 లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధికి విక్రమ్ రెడ్డి రూపొందించిన మానిఫెస్టోను విజయ సాయి రెడ్డి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం అధికార దాహంతోనే ఇప్పుడు మళ్లీ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. త్రిబుల్ తలాక్, సీఏఏ (CAA) బిల్లులకు వైసీపీ సపోర్ట్ చేయలేదని తెలిపారు. కేవలం దురుద్దేశంతో వైసీపీపై…
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల్లోగా బదిలీ కావాలని ఈసీ పేర్కొంది. అంతేకాకుండా.. తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్న ఈసీ తెలిపింది.
వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి అంటుకుంది. ఆ సీటు.. బీజేపీకి కేటాయించాలని కమలం పార్టీలో డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలో.. వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. ఓట్ బ్యాంక్, గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనని అసమ్మతి వర్గం అంటోంది. కాగా.. వైజాగ్ నుంచి పోటీ చేసేందుకు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఆశ పెట్టుకున్నారు. ఇతర పార్టీల కుటుంబ అవసరాల కోసం సీటును బీజేపీ వదులుకోవాల్సి వచ్చిందని జీవీఎల్ కీలక వ్యాఖ్యలు…
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖలో సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V1-MO -2736 నెంబర్ గల బోట్ లో వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు మత్య్సకారులు. అయితే వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫిషింగ్ బోట్లు, కోస్ట్ గార్డ్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉదయగిరిని సిరుల గిరిగా చేసుకుందామని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మహిళా శక్తి మహిళా నేతలతో కలిసి కాకర్ల సురేష్ సోమవారం సమావేశం నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి గెలుపే ఎమ్మార్పీఎస్ లక్ష్యం అని ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎంఎస్పి సీనియర్ నాయకులు ఉదయగిరి బిట్ టూ ఇంఛార్జి గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి, నియోజకవర్గంలోని మండల నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 125 పరుగుల లక్ష్యాన్ని మరో 27 బంతులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా మూడు మ్యాచ్ లు ఆడి.. మూడింటిలో గెలిచింది. ఇక.. ముంబై కూడా వరుసగా మూడింటిలో మూడు ఓడిపోయింది. హోంగ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ ల్లోనూ ముంబై విజయం సాధించలేకపోయింది. ముంబై…
ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. ఓ అభిమాని గ్రౌండ్ లోకి వచ్చాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ దగ్గరకు వెనుకనుంచి వెళ్లడంతో.. ఒక్కసారిగా భయపడ్డాడు. వెంటనే వెనక్కి జరిగి అభిమానికి హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడే కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది గ్రౌండ్ లోకి వచ్చి వెంటనే అతడిని బయటకు…
ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. హోంగ్రౌండ్ లో పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. రాజస్తాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బౌలింగ్‌లో.. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.