చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ విభాగం కూడా చాలా బలంగా ఉంది. అందుకు నిదర్శనం.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరణ తీసిన వికెట్లే. ఆ మ్యాచ్లో పతిరణ యార్కర్లతో విరుచుకుపడ్డాడు. గంటకు 150 కి.మీ వేగంతో యార్కర్ బౌలింగ్ వేసి ఒకే ఓవర్ లో రెండు కీలక వికెట్లు తీశాడు. కళ్లు మూసి తెరిచేలోపు బంతి జట్ స్పీడ్ తో దూసుకుపోయింది. 15 ఓవర్లో పతిరణ వేసిన బౌలింగ్లో మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్ను యార్కర్లతో ఔట్ చేశాడు. పతిరణ యార్కర్ బౌలింగ్కు బ్యాటర్లకు ఏం అర్ధం కాక ఔటైపోయారు.
Read Also: GST Collections: మార్చిలో జీఎస్టీ వసూళ్ల రికార్డులు..
ఇదిలా ఉంటే.. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు ఐదు వికెట్లకు 191 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే.. 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా.. సీఎస్‌కే అభిమానులకు ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. ఎంఎస్ ధోని ఈ సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చాడు. అంతేకాకుండా.. చెన్నై బౌలింగ్ లో ఫాస్ట్ బౌలర్ మతిష పతిరానా అద్భుతంగా బౌలింగ్ చేసి ఒకే ఓవర్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లను క్లీన్ బౌల్డ్ చేశాడు. పతిరనా యార్కర్ బౌలింగ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా.. సీఎస్కే తర్వాత మ్యాచ్ సన్ రైజర్స్ తో తలపడనుంది.
Very few things come close to a perfect 150k yorker in cricket. It's the equivalent of the perfect swerving free kick. The ultimate spectacle you'd see in cricket. And this is very close to perfection from Pathirana.pic.twitter.com/YXwK25s97W
— Rohit Sankar (@imRohit_SN) March 31, 2024
Read Also: Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. తెలంగాణలో ఎల్లో అలర్ట్