ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ముంబై వాంఖడే వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే హోంగ్రౌండ్ లో జరిగే ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలనే పట్టుదలతో ముంబై ఉంది. మరోవైపు.. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న రాజస్తాన్ కూడా.. మరో విజయంపై కన్నేసింది.
Read Also: Perni Nani: ప్రజల తిరుగుబాటుతో మాట మార్చారు.. పెన్షన్ల పంపిణీని ఎవరూ ఆపలేరు..
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నమన్ ధీర్, కోయెట్జీ, బుమ్రా, పీయూష్ చావ్లా, ములానీ, క్వేనా మఫాకా.
రాజస్తాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, జురెల్, షిమ్రాన్ హెట్ మేయర్, ఆర్. అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, చాహల్.