ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ డెక్కర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 163 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌కు మళ్లీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పీసీబీ (Pakisthan Cricket Board). వన్డే వరల్డ్ కప్ తర్వాత బాబర్ ఆజం.. పాకిస్థాన్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత.. అతని స్థానంలో టీ20లకు షహీన్ అఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్‌ను కెప్టెన్లుగా పీసీబీ నియమించింది.
సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)కు కీలక ప్లేయర్ దూరం కానున్నారని సమాచారం. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన హసరంగ.. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండరని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎడమ మడమ గాయం కారణంగా ఐపీఎల్-2024 నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సీజన్ సగం గడిచిన తర్వాత స్లో పిచ్‌లపై హసరంగ బ్యాటర్లకు ప్రమాదకరంగా మారతాడని, అలాంటి మ్యాచ్ విన్నర్ దూరమవ్వడం సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బే అని అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 199 పరుగులు చేసి పంజాబ్ ముందు 200 పరుగుల టార్గెట్ ను ఉంచారు. ఈ క్రమంలో లక్ష్యచేధనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో.. లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పరిశ్రమలు రావాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో కాకర్ల సురేష్, మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సుంకర అంజనాద్రి, వెంకటాద్రిల ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు.. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో తమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో.. టీడీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం నిర్వహించారు. విజయవాడ రూరల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ ముందు భారీ స్కోరును నిర్దేశించారు. పంజాబ్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటాన్ డికాక్ (54) అర్ధసెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ (15) పరుగులు చేశాడు.
'హలో... నేను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాను. మీ ఫోన్ నంబర్ కొన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించబడుతోంది. మేము ఈ నెంబర్ ను మూసివేస్తున్నాము. మీరు మీ నంబర్‌ను కొనసాగించాలనుకుంటే, మేము చెప్పిన వాటిని ధృవీకరించాలి...' అని మోసపూరితమైన కాల్స్ చేస్తుంటారు. ఒకవేళ.. ఈ కాల్ ని అలానే కొనసాగిస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బును కొట్టేస్తారు. ఇదొక సైబర్ మోసం.. +92 నంబర్ నుండి వినియోగదారుల వాట్సాప్‌కు కాల్‌లు వస్తున్నాయి. ఫోన్ చేస్తున్న వ్యక్తి మేము ఈ కంపెనీ నుండి…
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ఐసీసీ (ICC) గడువు ఇచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా.. ఐపీఎల్ స్టార్లపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు టాక్. ఈ టోర్నీలో రాణించిన ఒకరిద్దరికి జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా టాస్ గెలిచిన లక్నో.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ చేయనుంది. కాగా.. ఇప్పటివరకు లక్నో ఆడిన ఒక మ్యాచ్ లో ఓడిపోగా.. ఈ మ్యాచ్ లో గెలువాలనే కసితో బరిలోకి దిగుతుంది. మరోవైపు.. పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో.. ఒక మ్యాచ్ లో గెలిచి, మరో…