ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషియాన్ ఫుడ్ ఫర్ జోన్ ప్లేయర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ క్రికెటర్, ఢిల్లీ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ హాజరయ్యారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కి అందరూ ఓటేయాలని కొందరు ప్రజల ముందుకు వస్తున్నారు.. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి ఎందుకు ప్రజలు ఓటేయ్యాలని ప్రశ్నించారు. ఒక ఇల్లు ఇచ్చారా.. సెంటు జాగా ఇచ్చారా.? ఓటెందుకు వేయాలన్నారు. నిన్న ఒకటో తేదీ పింఛన్ డబ్బులు సుర్యోదయం కాకముందే ఇచ్చేసేవారు.. పింఛన్ ఎందుకు రాలేదో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. వాలంటీర్లు పింఛన్ ఇవ్వొద్దని చంద్రబాబు పిటిషన్ పెట్టేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులందరికీ ఇళ్ల వద్దే నగదు ఇవ్వాలి.. పెన్షన్ పంపిణీలో రెండు విధానాలు సరికావని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కుట్రలకు, నాటకాలకు తెర దించాలని కోరారు. లబ్దిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని ప్రస్తావించారు. ఆ బాధ్యతను సీఎం జగన్ సక్రమంగా నిర్వహించకుండా.. దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో క్వింటాన్ డికాక్ (81) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ (40*) పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడటంతో బెంగళూరు ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచింది.
చిత్తూరు జిల్లా రూరల్ మండలం పచ్చనపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారుల ఈత సరదా గ్రామాన్ని శోక సముద్రంలో ముంచింది. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఈత సరదా కోసం సమీపంలోని చెరువుకు వెళ్లారు. అయితే.. చెరువులో బురద ఎక్కువగా ఉండటంతో అందులో చిక్కుకుని ఇద్దరు బాలురు సంజయ్(15), ఆకాష్ (15) మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు.. చెరువు వద్దకు వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేక పోయింది. ఒకే గ్రామంలో ఇద్దరు చిన్నారుల మృతితో…
ఏపీలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వేసవిలో వడగాలుల సందర్భంగా స్కూళ్లల్లో జాగ్రత్తలు తీసుకుంటుంది విద్యాశాఖ. ఈ క్రమంలో.. వాటర్ బెల్ విధానాన్ని ప్రవేశపెడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు డీ-హైడ్రేషనుకు గురి కాకుండా వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ చేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్ లోటాస్ గెలిచిన బెంగళూరు.. మొదటగా బౌలింగ్ తీసుకుంది. ఈ క్రమంలో లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ జట్టులో అల్జరీ జోసెఫ్ స్థానంలో టాప్లీ ఆడుతున్నారు
లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా.. వింజమూరు ఎంపీడీవో కిరణ్ కుమార్ కు వింజమూరు మండల నాయకులతో కలిసి కాకర్ల సురేష్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పింఛను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ పై వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే…
మదనపల్లెలో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి.. పేదల భవిష్యత్తు కోస జరిగే యుద్ధంలో పాల్గొనడానికి అందరూ సిద్ధంగా ఉండండని తెలిపారు. ఇంటింటికి మంచి చేశాను.. 175కి 175, 25 ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు కూడా తగ్గకుండా ప్రజలందరూ గెలిపించాలని సీఎం జగన్ కోరారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చానని పేర్కొ్న్నారు.
ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. సంక్షేమం అనేది నిరంతరాయం.. అందుకు తగిన విధంగా ప్రభుత్వం ఎందుకు సన్నద్దంగా లేదని అడిగారు. మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి, మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మీ వైఖరి కనపడుతోందని ఆరోపించారు. సమర్ధవంతంగా పింఛన్ అందించడానికి అవసరమైన విధానాలు ఎందుకు రూపొందించుకోలేదని ప్రశ్నించారు.