ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. సన్ రైజర్స్కు ఉప్పల్ హోంగ్రౌండ్. అయితే.. అక్కడ ఆ పరిస్థితులు కనపడటం లేదు. ఉప్పల్ స్టేడియం చుట్టూ పసుపుమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పసుపు జెర్సీలే కనపడుతున్నాయి. దానికి కారణమేంటంటే.. సీఎస్కే జట్టులో ధోనీ ఉండటం. ధోనీ అంటే.. క్రికెట్ అభిమానులకు ఎంతో అభిమానం. అందుకోసమని తమ టీమ్ ను కాదని.. మరో టీమ్ ను సపోర్ట్ చేయడమంటే ధోని గొప్పతనం.
Read Also: Fire Accident: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం.. విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్ధం
మొన్న విశాఖలో జరిగిన సీఎస్కే-ఢిల్లీ మ్యాచ్ లో కూడా ఇవే పరిస్థితులు కనపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కు విశాఖ స్టేడియం హోంగ్రౌండ్.. అయినప్పటికీ సీఎస్కే తరుఫున అభిమానులు సపోర్ట్ చేశారు. ఆ మ్యాచ్ లో సీఎస్కే ఓడిపోయినా.. ధోనీ మాత్రం అభిమానుల మనసును గెలిచాడు. ఈరోజు కూడా హైదరాబాద్ అభిమానులంతా ధోనీ వైపే ఉన్నారు. ఈ క్రమంలో.. ధోనీ పేరుతో స్టేడియం పరిసరాలు మార్మోగుతున్నాయి. హైదరాబాద్ ఫ్యాన్స్ సైతం.. ఈ మ్యాచ్ వరకు చెన్నై వైపే ఉన్నారు. మరోవైపు.. ధోనీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉప్పల్ స్టేడియంకు భారీగా తరలి వచ్చారు ఫ్యాన్స్. మ్యాచ్ టికెట్ దొరకకపోయినా స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ వేలాదిగా వేచి చూస్తున్నారు.
Read Also: Harish Rao: మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది..
ఇదిలా ఉంటే.. ఈరోజు జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ పై గెలువాలని కసితో ఉంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెంటింటిలో ఓడిపోయి.. ఒక్క మ్యాచ్ లో గెలిచింది.