ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ బ్యాటింగ్ లో కెప్టెన్ శుభ్మాన్ గిల్ రాణించాడు. కేవలం 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 6 ఫోర్లు ఉన్నాయి.
Read Also: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంకు పవర్ కట్.. రేపటి మ్యాచ్ జరిగేనా..?
పంజాబ్ బ్యాటింగ్ లో సాహా (11), విలియమ్సన్ (26), సాయి సుదర్శన్ (33), విజయ్ శంకర్ (8), చివరలో రాహుల్ తెవాటియా 8 బంతుల్లో 23 పరుగులు చేయడంతో స్కోరు మరింత పెంచాడు. ఇక.. పంజాబ్ బౌలింగ్ లో రబాడ రెండు వికెట్లు పడగొట్టాడు. హర్ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.
Read Also: Iran: భద్రతా బలగాలపై సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడి.. 27 మంది మృతి..