సన్‌రైజర్స్ హైదరాబాద్ డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇంతకుముందు చెప్పు చూపి బెదిరించగా.. ఇప్పుడు నీకు తన్నులు తప్పేలా లేదన్నట్లుగా ఓ మీమ్ షేర్ చేశాడు. మరోసారి “చెత్త షాట్ ఆడి ఔటయ్యావు’’ అంటూ ఓ వ్యక్తి కర్ర చేతిలో పట్టుకుని మరో వ్యక్తిని తరుముతున్నట్లుగా ఉన్న మీమ్ ఒకటి షేర్ చేశాడు. కాగా.. యువరాజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
I’m right behind you boy …well played again – but bad shot to get out on 🤨@IamAbhiSharma4 #CSKvsSRH pic.twitter.com/IF8qLZ5S9Z
— Yuvraj Singh (@YUVSTRONG12) April 5, 2024
Read Also: CSK Fan: ఉప్పల్ స్టేడియంలో ఓ క్రికెట్ అభిమానికి చేదు అనుభవం..
అభిషేక్ శర్మ స్వస్థలం పంజాబ్.. ఇతను యువీకి పిచ్చి ఫ్యాన్. అంతేకాకుండా.. అభిషేక్‌కు యువరాజ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ‘‘యువీ పాజీ.. ధన్యవాదాలు’’ అంటూ కృతజ్ఞత చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ ఇలా స్పందించాడు.
కాగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. కేవలం 12 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 166 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సన్ రైజర్స్.. ఈ లెఫ్టాండ్ ఓపెనర్ మంచి శుభారంభాన్ని అందించాడు. ఇంకాస్త సేపు అభిషేక్ శర్మ క్రీజులో ఉండుంటుంటే.. ఇంకా త్వరగా మ్యాచ్ ముగిసేది. కానీ.. చహర్ వేసిన బౌలింగ్లో బౌండరీ లైన్ దగ్గర జడేజా క్యాచ్ పట్టాడు. దీంతో.. అతని దూకుడు ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.