సన్రైజర్స్ అభిమానులకు ఇదొక భారీ షాక్ అని చెప్పాలి. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు ESPNcricinfo తెలిపింది. కాగా.. మినీ వేలంలో హసరంగను రూ. 1.5 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదని శ్రీలంక అతడికి పూర్తి విరామం ఇచ్చింది. ప్రస్తుతం హసరంగ శ్రీలంకలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ మేనిఫేస్టోలో “ముస్లిం లీగ్” ఆలోచనలు.. దేశాన్ని విడగొట్టే యత్నం..
అంతకుముందు హసరంగ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడేవారు. హసరంగ ఐపీఎల్‌లో 26 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 35 వికెట్లు తీయగా.. 72 పరుగులు చేశారు. హసరంగ శ్రీలంక టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడడమే అతనికి మొదటి ప్రాధాన్యత. అటువంటి పరిస్థితిలో.. అతను పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి ఐపీఎల్ నుండి నిష్క్రమించాడు. జూన్‌లో వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు హసరంగ పూర్తిగా ఫిట్‌గా ఉంటే.. శ్రీలంక తరఫున ఆడనున్నాడు. కాగా.. ఈ సీజన్‌లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో హైదరాబాద్ 4 మ్యాచ్‌లు ఆడగా, అందులో 2 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌లు ఓడిపోయింది.
Wanindu Hasaranga has been ruled out of #IPL2024 ❌ pic.twitter.com/K4F1vl07qq
— ESPNcricinfo (@ESPNcricinfo) April 6, 2024
Read Also: IPL 2024: ఢిల్లీని వెంటాడుతున్న గాయాల బెడద.. మరో ప్లేయర్ ఔట్..!