హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో తొలి విజయాన్ని సాధించింది. 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి గెలుపు రుచి చూసింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా లేనప్పటికీ.. అతనిలో నాయకత్వ స్ఫూర్తి ఇప్పటికీ కనిపిస్తుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ శర్మ స్పీచ్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2024లో ఇండియా క్రికెటర్లదే హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు 21 మ్యాచ్ లు జరగ్గా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇండియా క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ 316 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ (191), రియాన్ పరాగ్ (185), శుభ్ మన్ గిల్ (183), సంజూ శాంసన్ (178)పరుగులతో టాప్ లో కొనసాగుతున్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో లక్నో ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గెలుపొందింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (31) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత శుభ్ మాన్ గిల్ (19), విలియమ్సన్ (1), శరత్ (2), విజయ్ శంకర్ (17), నాల్కండే (12), చివరలో రాహుల్ తెవాటియా (30) పరుగులు చేశాడు. రషీద్…
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉనాలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన తర్వాత.. ఆయిల్ కిందకు కారి మంటలు వ్యాపించాయి. దీంతో పలు వాహనాలు, దుకాణాలు కూడా దగ్ధమయ్యాయి. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. హరోలి ప్రాంతంలోని తహ్లివాలా కస్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కాగా.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 164 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచింది. కాగా.. గుజరాత్ బౌలర్లు బ్యాటర్లను కట్టడి చేయడంతో పరుగులు ఎక్కువ చేయకుండ ఆపారు. ఇదిలా ఉంటే.. లక్నో బ్యాటింగ్ లో మార్కస్ స్టోయినీస్ అత్యధికంగా (58) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ (33),…
మిర్యాలగూడలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. లోక్ సభలో పోటీకి టికెట్ కేటాయింపులలో మాదిగలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ భావిస్తుందని తెలిపారు. బీసీలు సైతం కాంగ్రెస్ పార్టీని ప్రథమ శత్రువుగా భావించాలని పిలుపునిస్తోందని అన్నారు. తెలంగాణలో అసలు మాదిగలు లేనట్లుగా భావించి.. పూర్తిగా మాదిగలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్ట్ జడ్జి కావేరి బవెజా తీర్పు ఇవ్వనున్నారు. కాగా.. తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించింది. గత గురువారం నాడు కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత మధ్యంతర బెయిల్ పై స్పెషల్ కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. కాసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చలు కొనసాగాయి. తాజాగా.. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదితను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, వేలాదిమంది కార్యకర్తల శ్రమ, వందల మంది నాయకుల కష్టంతో కేసీఆర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తెల్లం వెంకటరావు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గంలో ఏకైక స్థానాన్ని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని.. స్థానికుడు చదువుకున్న వ్యక్తి అని ఓటు వేసి గెలిపించారని తెలిపారు. తన స్వార్థం కోసం…