మెదక్ జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏం పొయ్యేకాలం వచ్చిందో కేసీఆర్ కి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశాడన్నారు. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేడీ గ్యాస్ ధర 1200 చేసి…
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో.. నేతలు ప్రచార జోరు పెంచారు. తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగానే.. ఖమ్మం పార్లమెంట్ స్థానం తరుఫున గురువారం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55 డివిజన్లో ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ.. వైసీపీకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు, అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని.. ఎంతమంది కూటమి పార్టీలన్నీ గుంపుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి విజయం కాయమన్నారు. విజయవాడలో ఎవరికి ఏ…
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో 16 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన అభిషేక్ శర్మకు టీ20 ప్రపంచకప్ లో చోటు లభించే అవకాశాలు ఉన్నాయా..? అంటే.. దానికి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ప్రపంచకప్ లో స్థానం లభించడం ఛాన్సే లేదంటున్నారు. ఐపీఎల్ లో అభిషేక్ 218 స్ట్రైక్ రేట్ లో ఆడుతున్నాడు. తాను క్రీజులో ఉన్నంతసేపు బాల్ బౌండరీలు దాటాల్సిందే.. ప్రత్యర్థి బౌలర్లకు అతను చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో.. యువరాజ్ సింగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ, "అభిషేక్ దాదాపు ప్రపంచకప్ ఆడేంత…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. మొదట టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
లోక్సభ ఎన్నికల్లో భాగంగా.. ఈరోజు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ఓటేసేందుకు యువతీ, యవకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో వృద్ధ ఓటర్లు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. 106 ఏళ్ల బామ్మ ఓటేసి ఆదర్శంగా నిలిచారు. బీహార్ రాష్ట్రం బరారిలో 106 వృద్ధురాలు ఓటేసి అందరి కళ్లు తన వైపు చూసేలా చేసింది. గురుబజార్‌లోని ఆదర్శ్ మిడిల్ స్కూల్‌లో ఉన్న…
అమరావతిలో వైసీపీ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం అందించానని తెలిపారు. సీఎం జగన్ పాలనలో…
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవెల్లి మండలం భైరవపట్నం గ్రామంలో ముదినేపల్లి మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు.. KDCC బ్యాంక్ చైర్మన్ తాతిలేని పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ.... జగనన్న రెండు రోజుల్లో విడుదల చేసే మేనిఫెస్టోను మన కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాకుండా.. అక్కా చెల్లెలు గ్రామాల్లో తిరిగి మన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.
స్కూల్ బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు చిన్నారులకు గాయాలైన ఘటన బీహార్ లోని సరన్ జిల్లాలో జరిగింది. బనియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దధిబాధి గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు అర డజను మంది పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి స్థానికులు.. పిల్లలందరినీ బస్సులో నుంచి క్షేమంగా కిందకు దించారు. గాయాలైన పిల్లలను వెంటనే బనియాపూర్ రిఫరల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా…
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. ప్రతి ఇంటికీ మహిళలు కొలికపూడికి మంగళ హారతులు, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాలను కొలికపూడి ప్రజలకు వివరించారు. తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తాను.. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేయండి.. తిరువూరిని అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు.