కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పుత్తా కుటుంబం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత కమలాపురం కోటపై టీడీపీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలువగా.. 2014, 2019లో జగన్ మేనమామ పి. రవీంధ్రనాథ్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. మరోవైపు వరుసగా ఓడిపోయినా ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ... ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్నామని పుత్తా ఫ్యామిలీ చెబుతోంది. నాలుగు సార్లు ఓడిపోయిన పుత్తాకు ఈసారి…
కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్ప్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు ముస్కాన్ మొహబ్బత్ షేక్ (5), సాజిద్ మహ్మద్ షేక్ (7)గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తమ పేర్లను స్థానిక ఆలయ పండుగ కరపత్రంలో ప్రచురించకపోవడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక వర్గం మరో వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
భూమ్మీద నూకలు ఉన్నట్లు ఉంది.. అందుకే బతికి బయటపడ్డాడు. చిరుత దాడి చేసినా తీవ్ర గాయాలైనప్పటికీ సేఫ్ గానే ఉన్నాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విటల్.. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో చిరుత దాడి చేసింది. ఈ ఘటన హరారే సమీపంలోని బఫెలో రేంజ్ లో జరిగింది. ఈ విషయాన్ని తన భార్య హన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తీవ్ర గాయాలైన విటలో ఫోటోను ఆమె పోస్ట్ చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠపోరు నడిచింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు టెన్షన్ నెలకొంది. చివరకు ఢిల్లీ గెలుపొందింది. 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం నమోదు చేసుకుంది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. చివర్లో రషీద్ ఖాన్ సూపర్ గా ఆడినప్పటికీ గుజరాత్ ఓటమి పాలైంది. గుజరాత్ బ్యాటింగ్ లో వృద్ధిమాన్ సాహా (39), గిల్ (6), సాయి సుదర్శన్ (65) పరుగులతో రాణించాడు. మిల్లర్…
ఈరోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎంతో సేవ చేశానని తెలిపారు. ఎన్నికల్లో ఎవరో చెబితో ప్రజలు ఓట్లు వేయరు.. వారికి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేస్తారన్నారు. అది ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని ఆరోపించారు. వారు కుర్చీ కోసం…
మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఆయన సతీమణి కొండా సంగీతా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కే పురం, టెలిఫోన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 224 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ (88*) పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ అక్షర్ పటేల్ కూడా (66) పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరును చేయగలిగింది. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి.
ఎన్నికలకు గత కొంత కాలంగా సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ చేసిన బీసీ జనార్థన్ రెడ్డి సరిగ్గా ఎన్నికల కోడ్ వచ్చాక అదను చూసి వైసీపీని చావుదెబ్బ కొట్టారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత గ్రామం అయిన తమ్మడపల్లెలో తొలిసారిగా బీసీ జనార్థన్ రెడ్డి పాగా వేసారు. గత 20 ఏళ్లుగా ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి నమ్మిన బంటుల్లాగా ఉంటున్న 20 మంది ముఖ్య అనుచరులు బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.