పెంపుడు కుక్కలతో చాలా మందికి ఎంతో అనుబంధం ఉంటుంది. ఎంత అంటే.. ప్రాణం కంటే ఎక్కువని చెప్పొచ్చు. పెంపుడు కుక్కలను ఎంతో ఇష్టంగా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే.. పెంపుడు కుక్క చనిపోయిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోని యమునానగర్ లో చోటు చేసుకుంది. బాలిక మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అనంతరం.. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా.. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా ఆలుగునూర్లో మానకొండూర్ నియోజకవర్గ బూత్ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే జూన్ 2 తరువాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రమాదముందని తెలిపారు. మాకు మూడో వంతు మెజారిటీ ఇవ్వండి రిజర్వేషన్లు ఎత్తేస్తం అని బీజేపీ వాళ్ళు అంటున్నారని పేర్కొన్నారు. ఎంపీగా పని చేసిన బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. బండి సంజయ్కు సవాల్ చేస్తున్నా..…
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. తన భారత పర్యటనను వాయిదా వేసుకుని చైనాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఇండియాలో పర్యటించాల్సింది ఉంది.. కానీ ఆదివారం అకస్మాత్తుగా చైనాను సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాల పరంగా చైనా రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.. వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మస్క్ పర్యటనకు సంబంధించిన విషయాలు తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండలేకపోతుందని ఆరోపించారు. మేము మా కుటుంబం మాత్రమే దేశాన్ని పరిపాలించాలి అనే దుర్మార్గపు ఆలోచనతో సోనియా గాంధీ ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. రాహుల్ గాంధీ జోడో యాత్రను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. రాహుల్ గాంధీ చేసింది భారత్ జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్ర చేసిన దగ్గర కాంగ్రెస్ నాయకులు…
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. వన్యప్రాణి విభాగం సిబ్బంది, జూ అధికారులు చిరుత కోసం అక్కడి పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు…
మెదక్ లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే కుట్ర చేస్తుందని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మోడీ మారుస్తాడని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు.. అంబేడ్కర్ మళ్ళీ పుట్టి…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని ప్రజలు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామని కేటీఆర్ తెలిపారు. మనం కూడా జై శ్రీరామ్ అందాం.. రాముడు అందరివాడు.. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ లో బీజేపీ, బీఆర్ఎస్ కే మధ్య పోటీ…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలనం సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే చేధించి రికార్డు సృష్టించింది. 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ బ్యాటర్లు చితక్కొట్టారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్కతా బౌలర్లకు తమ హోంగ్రౌండ్ లో చుక్కలు చూపించారు. బ్యాటింగ్ కు వచ్చినోళ్లు వచ్చినోళ్లు సిక్సర్ల వర్షం కురిపించారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ (54) అర్థసెంచరీతో అదరగొట్టాడు.
ఎన్నికల ప్రచారంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు దూసుకుపోతున్నారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ... మరొక అవకాశం ఇవ్వాలని కోరుతూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ.. ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి, మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని జగన్మోహనరావు కోరుతున్నారు. పూలతో, హారతులతో మహిళలు, ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
ఐపీఎల్ ముగియగానే టీమిండియా.. టీ20 వరల్డ్ కప్ 2024 ఆడనుంది. అందుకు సంబంధించి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి పొట్టి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే 1లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. కాగా.. ఏప్రిల్ 28 లేదా 29న భారత జట్టును ప్రకటించే అవకాశముంది. ఇదిలా ఉంటే..…