చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన చేవెళ్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి శుక్రవారం విడుదల చేశారు. తనను గెలిపించడం ద్వారా.. నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదేళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట ప్రజల ముందుకు తీసుకొచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ సంకల్ప పత్రాన్ని మీడియాకు వివరించారు. చేవెళ్లను దేశంలో అత్యుత్తమ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. 207 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. ఈ మ్యాచ్ లో చతికిలపడింది. 35 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 6 వరుస ఓటముల తర్వాత బెంగళూరు విక్టరీని నమోదు చేసింది. మొదటగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్ (1) పరుగు చేసి నిరాశపరిచాడు. అభిషేక్ శర్మ (31) పరుగులు చేసి క్రీజులో ఉన్నంత సేపు పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు…
టీమిండియా టార్గెట్ టీ20 వరల్డ్ కప్ గెలవడమే.. ఇప్పటికే రెండు ట్రోఫీలను చేజార్చుకున్న భారత్.. ఈ ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో.. జట్టు బలంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, ఎక్స్ పర్ట్స్ ఇండియా జట్టు ఎలా ఉండాలో వారి అంచణాను చెబుతున్నారు. తాజాగా.. భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ నవజ్యోత్ సింగ్ సింధు కూడా చేరాడు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ప్రత్యేక సలహా…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ ముందు 207 పరుగుల స్కోరును ఉంచింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. డుప్లెసిస్ (25) పరుగులు చేశాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (6) పరుగులు చేసి తొందర్లోనే పెవిలియన్ బాట పట్టాడు.
ఎన్నికల ప్రచారంలో బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి, కుమార్తె, కోడలు, సోదరులంతా ఏకమై ఊరూరా ఇంటింటికి తిరుగుతూప్రజలతో మమేకవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ కుటుంబ సభ్యుల ప్రచారానికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మరోవైపు.. ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలు టీడీపీ, వైపీపీ పోటాపోటీగా ప్రచారం చేస్తేన్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్న టీడీపీ…
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 30 వైడ్ బాడీ A350-900 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఎయిర్‌లైన్స్ గురువారం ఈ ప్రకటన చేసింది. కంపెనీ ప్రస్తుతం నారో బాడీ ఎయిర్‌బస్ విమానాలను మాత్రమే నడుపుతోంది. అయితే.. ఇస్తాంబుల్ మార్గంలో కార్యకలాపాల కోసం టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుండి రెండు బోయింగ్ 777 విమానాలను కంపెనీ లీజుకు తీసుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూకుడుగా మీదున్న ఎస్ఆర్హెచ్.. మరోసారి విజయం సాధించేందుకు బరిలోకి దిగుతుంది. ఇటు.. ఆర్సీబీ వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండటంతో.. ఈ మ్యాచ్ లో గెలిచి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండవేడిమి, తీవ్ర వడగాల్పుల మధ్య జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో.. వాతావరణ శాఖ ఒక ఉపశమనం వార్త చెప్పింది. IMD ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ మార్పులు మారబోతున్నాయి. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు వాయువ్య భారతదేశంలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఈశాన్య భారతదేశంలో కూడా ఎండల బారీ నుండి ప్రజలు కూడా ఉపశమనం పొందనున్నారు. ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఈశాన్య భారతదేశంలోని వివిధ…
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ఎవరు ఆడితే బాగుందనే అంచనా వేస్తున్నారు టీమిండియా మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే పలువురు మాజీ ప్లేయర్లు తమ అంచనాను తెలియజేశారు. తాజాగా.. హర్భజన్ సింగ్ కూడా తన అంచనా తెలియపరిచాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఆడే తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆయన సెలక్ట్ చేశాడు. ఆయన జాబితాలో సీనియర్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం ఇవ్వలేదు. వీరితో పాటు కేఎల్ రాహుల్‌ను సైతం…
మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని అభిమానులు ఎవరూ ఉండరు. ఆయనకు దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఫుల్ క్రేజ్ కూడా ఉంది. తాజాగా.. ధోనీ ఐపీఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకిదే చివరి సీజన్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. అభిమానులు తలాను చూసేందుకు స్టేడియానికి పోటెత్తుతున్నారు. చిన్న చితకా అని తేడా లేకుండా మహీ కోసం బారులు తీరున్నారు. ఇదిలా ఉంటే.. ధోనీకి అమ్మాయిలు, అబ్బాయిలతో పాటు చిన్న పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలోనే…