లోక్సభ ఎన్నికల్లో భాగంగా.. ఈరోజు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ఓటేసేందుకు యువతీ, యవకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో వృద్ధ ఓటర్లు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. 106 ఏళ్ల బామ్మ ఓటేసి ఆదర్శంగా నిలిచారు. బీహార్ రాష్ట్రం బరారిలో 106 వృద్ధురాలు ఓటేసి అందరి కళ్లు తన వైపు చూసేలా చేసింది. గురుబజార్‌లోని ఆదర్శ్ మిడిల్ స్కూల్‌లో ఉన్న పోలింగ్ బూత్‌లో 106 ఏళ్ల చలో దేవి ఓటు వేశారు.
Delhi: పైలట్‌గా బిల్డప్.. ఎయిర్‌పోర్టులో హల్‌చల్.. చివరికిలా..!
ఈ ప్రజాస్వామ్య మహత్తర పండుగ నాడు.. ఆమె కుమారుడు బిల్తు యాదవ్, తన ఒడిలో పెట్టుకుని తీసుకొచ్చి ఓటు వేయించాడు. ఆమె వయస్సు ఎక్కువుగా ఉన్నందున నడవలేని స్థితిలో ఉంది. ఈ క్రమంలో.. తల్లికి కొత్త చీర కట్టించి పోలింగ్ బూత్ కు తీసుకొచ్చాడు. కాగా.. వృద్ధురాలు బూత్ కు తీసుకురాగానే ఓటు వేసేందుకు ఉద్యోగులు సహకరించారు. అయితే.. వృద్ధులు, గర్భిణులు క్యూలో నిలబడకుండా ఓటు వేయాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ మోహరించిన పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది వృద్ధురాలికి ఓటింగ్‌లో సహకరించారు. తన కొడుకుతో కలిసి ఈవీఎం గదికి పంపి ఓటింగ్ నిర్వహించారు. వణుకుతున్న చేతులతో చలో దేవి ఈవీఎం బటన్‌ను నొక్కింది. అనంతరం ఛలో దేవి తన వేలిపై వేసిన సిరాను ఇతరులకు చూపించి ఓటు వేయాలని కోరింది.
Guinness World Record: ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. విశేషాలేంటంటే..