మెదక్ జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్కడ మోడీ, ఇక్కడ కేడీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏం పొయ్యేకాలం వచ్చిందో కేసీఆర్ కి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశాడన్నారు. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేడీ గ్యాస్ ధర 1200 చేసి ఆడబిడ్డల సొమ్ము దోచుకుని ఉసురు తాకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు తెలంగాణలో 25 లక్షలు ఇస్తే వాటిని కేసీఆర్ డబ్బా ఇల్లు అన్నారు.. డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని చెప్పి కేసీఆర్ ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఎక్కడినుంచో ఉడుము లాగా ఊడిపడ్డాడు మోడీ.. బ్రిటిష్ వాళ్ళ లాగా గుజరాత్ నుంచి మోడీ, అమిత్ షా వచ్చారని దుయ్యబట్టారు. వీళ్ళకి మరో ఇద్దరు అదాని, అంబానీలు తోడు అయ్యారని విమర్శించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటిష్ జనతా పార్టీ అని అన్నారు.
Pakistan: పొలిటికల్ మైలేజ్ కోసం భారత ఎన్నికల్లోకి మమ్మల్ని లాగొద్దు.. పాక్ కీలక వ్యాఖ్యలు..
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ కాల నాగు లాంటోడు.. తోక ఊపుతే ఉకునే టైపు కాదని ఆరోపించారు. ఎక్కడున్నా విడువడు.. దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు. దేశంలో ఉన్న రైతులకు ఆదానీ, అంబానీలకు బానిసలుగా మార్చాలి.. రిజర్వేషన్లు తీసేయాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఇందిరమ్మ తర్వాత మెదక్ జిల్లాకు పరిశ్రమలు రాలేదు.. బీబీ పాటిల్ అంగీ మార్చాడు, రంగు మార్చాడు, టోపి మార్చిన పాటిల్ బుద్ది మారలేదని దుయ్యబట్టారు. బీబీ పాటిల్ కాదు ఆయన బిజినెస్ పాటిల్ అని విమర్శించారు. పదేళ్లు ఎంపీగా ఉండి మీ సమస్యలపై ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేసీఆర్ కి చెప్పే బీబీ పాటిల్ బీజేపీలో వెళ్ళాడన్నారు. బిడ్డ బయటికి రావాలంటే జహీరాబాద్ లో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు.
World Longest Book: 4వేల పేజీలు, 12లక్షల పదాలు.. అత్యంత సుదీర్ఘ పుస్తకంగా రికార్డ్..
కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వల్లే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రాలో పార్టీ ఉనికి కోల్పోయిన 60 ఏళ్ల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చిందన్నారు. తెలంగాణ వచ్చాక పదేళ్ల పాటు తెలంగాణ తల్లి కేసీఆర్ చేతిలో, గదిలో బంది అయ్యిందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గానికి వరాలు ఇచ్చారు. సురేష్ షెట్కార్ ని ఎంపీగా గెలిపిస్తే నారాయణఖేడ్ కి స్పెషల్ డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. మహిళ ఐటీఐ కూడా ఎలక్షన్ అయిపోగానే మంజూరు చేస్తానన్నారు. జహీరాబాద్ లో 2 వేల ఎకరాలు భూ సేకరణ చేస్తే ఫార్మా సిటీ తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని పేర్కొన్నారు.