ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈ సీజన్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముందు ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అందుకోసం అన్ని దేశాలు సమయాత్తమవుతున్నాయి. ఈ మెగా టోర్నీని దక్కించుకునేందుకు అన్ని దేశాల ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
ఉంగుటూరు మండలంలోని నందమూరు, మధిరపాడు, చికినాల్, బోకినాల, చాగంటిపాడు, వేంపాడు, తరిగొప్పుల గ్రామాల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. సూపర్ సిక్స్ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 78 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో సీఎస్కే విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. ఈ మ్యాచ్ లో ఓటమితో సన్ రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు రాణించలేకపోయారు. ట్రేవిస్…
మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం.. కారు కార్ఖానాకు పోయింది... ఇక అది వాపస్ రాదని విమర్శించారు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారని దుయ్యబట్టారు. కేసీఆర్ బస్సు యాత్ర.. తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉందని విమర్శించారు. వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ దివాళాకోరుతనానికి, చేతకానితనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. 213 పరుగుల భారీ టార్గెట్ ను ముందుంచింది. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లు హైదరాబాద్ బౌలర్లకు ఊచకోత చూపించారు. సిక్సులు, ఫోర్లతోనే డీల్ చేశారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. అతనికి తోడు…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్.. కల్వకుంట్ల పేరు తీసేసి అబద్ధాల కేసీఆర్ అని పెట్టాలన్నారు. కేసీఆర్ బాధ కరెంట్ గురుంచి కాదు.. పొలిటికల్ పవర్ లేదని ఆరోపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసేటపుడు మూడు సార్లు కరెంట్ పోయింది అంటే ఎవరు నమ్మరని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఎప్పుడు విడిపోతే అప్పుడు సీఎం కావాలి అనుకునేవాడు కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ…
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో బంగార్మావు వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ వాళ్లు గజగజ వణుకుతున్నారని అన్నారు. ఢిల్లీకి వెళ్లి మోడీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యాడని తెలిపారు. నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలనలో తిట్లు లేకపోతే దేవుని మీద ఒట్టు అని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఫైట్ ఉండనుంది. చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఇంతకముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ఓడిపోయింది. ఈ క్రమంలో.. ఈ మ్యాచ్ గెలువాలనిన చూస్తోంది. అటు సీఎస్కే కూడా.. ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని చూస్తోంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 24 బంతుల్లో ఉండగానే గెలుపొందింది. గుజరాత్ భారీ స్కోరు చేసినప్పటికీ.. ఆర్సీబీ బ్యాటర్లు విల్ జాక్స్ (100*) సెంచరీతో చెలరేగాడు. దీంతో ఆర్సీబీ విజయం నమోదు చేసుకుంది. అతని ఇన్నింగ్స్ లో 10 సిక్సులు, 5 ఫోర్లు…