స్కూల్ బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు చిన్నారులకు గాయాలైన ఘటన బీహార్ లోని సరన్ జిల్లాలో జరిగింది. బనియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దధిబాధి గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు అర డజను మంది పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి స్థానికులు.. పిల్లలందరినీ బస్సులో నుంచి క్షేమంగా కిందకు దించారు. గాయాలైన పిల్లలను వెంటనే బనియాపూర్ రిఫరల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఛప్రా సదర్ ఆస్పత్రికి తరలించారు. కొల్హువా గ్రామంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు మధ్యాహ్నం 1 గంటల సమయంలో పిల్లలతో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Viral Video : పెళ్లి డ్రెస్సులోనే ఓటువేసిన పెళ్లికూతురు.. ఎక్కడంటే?
ఇదిలా ఉంటే.. ఎండ వేడిమి కారణంగా అన్ని పాఠశాలలు ఉదయం 11.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ ఒకరోజు ముందు ఆదేశించినట్లు సమాచారం. ఇంత జరిగినా ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. అక్కడి స్థానికులు ఉండటం వల్ల పెద్ద ప్రమాదేమీ జరగలేదు. కానీ.. లేదంటే ప్రమాదం ఏ విధంగా జరిగి ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. మరోవైపు.. జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలను పాటించి 11:30 గంటలకు పాఠశాల మూసివేసి ఉంటే, బహుశా ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదని అంటున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేది.
Read Also: Model missing: ఏడాది క్రితం మిస్సైన థాయ్‌లాండ్ మోడల్.. చివరికి ఏమైందంటే..!