KKR vs PBKS: పంజాబ్ వీర విహారం.. సంచలన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలనం సృష్టించింది. 262 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే చేధించి రికార్డు సృష్టించింది. 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ బ్యాటర్లు చితక్కొట్టారు. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కోల్కతా బౌలర్లకు తమ హోంగ్రౌండ్ లో చుక్కలు చూపించారు. బ్యాటింగ్ కు వచ్చినోళ్లు వచ్చినోళ్లు సిక్సర్ల వర్షం కురిపించారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ (54) అర్థసెంచరీతో అదరగొట్టాడు.
ఆ తర్వాత జానీ బెయిర్ స్టో (108*) సెంచరీతో చెలరేగాడు. అతని ఇన్నింగ్స్ లో 9 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత రీలే రోసో (26) పరుగులు చేశాడు. ఆ తర్వాత శశాంక్ సింగ్ (68) పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో అత్యధికంగా 42 సిక్సులు నమోదయ్యాయి. కోల్కతా బౌలింగ్ లో కేవలం సునీల్ నరైన్ ఒక్కడే ఒక్క వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కోల్కతా భారీ స్కోరు చేసినప్పటికీ.. ఓడిపోయింది. పంజాబ్ ఈ స్కోరును చేధించడంతో రికార్డ్ నమోదు చేసింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 261 స్కోరును సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్లు సాల్ట్, సునీల్ నరైన్ లు రెచ్చిపోయారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫిల్ సాల్ట్ 37 బంతులతో 6 ఫోర్స్, 6 సిక్సుల సహాయంతో 75 పరుగులను రాబట్టగా.. మరోవైపు ఆల్ రౌండర్ సునీల్ నరైన్ మరోసారి తనదైన బ్యాటింగ్ స్టైల్ తో కేవలం 32 బంతులలో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 71 పరుగులను చేశాడు. దాంతో మొదటి వికెట్ కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొంది. వెంకటేష్ అయ్యర్ 39 పరుగులు, ఆండ్రు రస్సెల్ 12, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో కేకేఆర్ భారీ స్కోరును చేయగలిగింది. పంజాబ్ బౌలర్స్ విషయానికి వస్తే.. అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, సామ్ కరణ్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్లు చెరో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
-
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
-
Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
-
CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్‌లకు ప్రశంసలు..
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?