Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. వన్యప్రాణి విభాగం సిబ్బంది, జూ అధికారులు చిరుత కోసం అక్కడి పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు.
Drugs Sized: గుజరాత్ తీరంలో 602 కోట్ల డ్రగ్స్ స్వాధీన.. 14 మంది పాకిస్థానీలు అరెస్టు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు. చిరుత కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. దాదాపు మూడేళ్ల క్రితం చిరుతపులి విమానాశ్రయం గోడపై నుంచి దూకిన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. చిరుత విమానాశ్రయం గోడ దూకి గోల్కొండ, బహదూర్ గూడ వైపు వెళుతున్నట్లు కనిపించింది. కాగా.. ఇప్పుడు మరోమారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.
Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు కౌంటర్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!