ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ 153 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఓ మోస్తారు స్కోరును సాధించింది. ఢిల్లీ భారీ స్కోరు చేయకుండ ఉండేందుకు కేకేఆర్ బౌలర్లు శ్రమించడంతో పరుగులను కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటింగ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా (35*) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (27) పరుగులు సాధించాడు.
గత నెలలో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో చైనీస్ ఇంజనీర్లు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. మార్చి 26న జరిగిన దాడిలో ఐదుగురు చైనా ఇంజనీర్లు, ఒక పాకిస్థానీ డ్రైవర్ మరణించారు. వీరంతా ఇస్లామాబాద్ నుంచి దాసు జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్తుండగా.. ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది.
ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 2024 జూన్ 1 నుండి వెస్టిండీస్, అమెరికాలో ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మే 1తో జట్టు ప్రకటన గడువు ముగియనుంది. దీంతో ఈరోజు లేదా రేపు జట్టు ప్రకటించే అవకాశముంది. అయితే.. టీమిండియాలో వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు.. అతనికి పోటీగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి. ఇంతకుముందు మ్యాచ్ లో ఓడిపోయిన కేకేఆర్.. ఈ మ్యాచ్ లో గెలిచి పుంజుకోవాలని చూస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్ లో విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని డీసీ భావిస్తోంది.
ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్‌పై బహిరంగంగా కొడుతూ తోసేసుందుకు ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. భార్యను కొడుతున్న వీడియో వైరల్ కావడంతో.. నిందితుడు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రోషన్ గా గుర్తించారు. ఆ వీడియోలో చెన్నైలోని కోయంబేడు ఫ్లై ఓవర్‌పై రోషన్ తన భార్యపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. అయితే.. ఈ వీడియోను ఫ్లై ఓవర్‌పై ఉన్న బాటసారులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో సూపర్ విక్టరీ సాధించిన ఆర్సీబీ.. మళ్లీ ప్లేఆఫ్ ఆశలను రేపింది. ఇప్పుడు అభిమానులందరి మదిలో ఇదే ప్రశ్న మెదులుతుంది. అయితే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో టాప్-4 లో ఉండాలంటే కొన్ని అవకాశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
మొయినాబాద్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి జి. రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు పోతాయి.. కాంగ్రెస్ వస్తే బీసీగణన పథకాలు వస్తాయని తెలిపారు. ఇదే విషయాన్ని మొన్నటి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే.. బీజేపీ నేతలకు గుబులు పట్టుకుందని అన్నారు. అందుకే ఇప్పుడు మాట మార్చి ఏదేదో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
కెన్యాలో డ్యామ్ తెగిన ఘటనలో 42 మంది మృతి చెందారు. పలువురు బురదలో కూరుకుపోయారు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. కాగా.. కెన్యాలో కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. ఓ డ్యామ్ తెగిపోయి అక్కడి జనాన్ని అతలాకుతలం చేసింది. నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యామ్ లో నీటి ఒత్తిడికి కట్ట తెగిపోయింది. ఆ నీరంతా సమీపంలోని ఊళ్లను ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోగా.. రోడ్లు తెగిపోయాయి. అంతేకాకుండా.. 42 మంది మృత…
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. గడపగడపకు వెళ్లి తమకు ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగర్లో పాదయాత్ర మొదలు పెట్టారు. పద్మారావు గౌడ్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పద్మారావు గౌడ్కు సనత్ నగర్…
వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వికారాబాద్ నియోజకవర్గంలోని పూడూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీకి వస్తున్న ఆదరణతో కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ముందు నిలబడలేకనే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేథీ…