Suicide: పెంపుడు కుక్క చనిపోయిందని మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెంపుడు కుక్కలతో చాలా మందికి ఎంతో అనుబంధం ఉంటుంది. ఎంత అంటే.. ప్రాణం కంటే ఎక్కువని చెప్పొచ్చు. పెంపుడు కుక్కలను ఎంతో ఇష్టంగా అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అయితే.. పెంపుడు కుక్క చనిపోయిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోని యమునానగర్ లో చోటు చేసుకుంది. బాలిక మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అనంతరం.. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా.. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఆదర్శ్ నగర్ క్యాంపులో నివాసముంటున్న ఆస్మిన్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మధ్య కుమార్తె.. 12 ఏళ్ల బాలిక ఆరో తరగతి చదువుతోంది. కొద్ది రోజుల క్రితం ఓ కుక్కను ఇంటికి తీసుకొచ్చుకుంది. ఆ అమ్మాయి ఈ కుక్కతో ఎంతగా అనుబంధం పెంచుకుంది. స్కూలు నుంచి తిరిగి రాగానే దానితో ముచ్చటించేది. అంతేకాదు.. పడుకునేటప్పుడు కూడా కుక్కను తన దగ్గర పడుకోబెట్టుకునేది. కుక్కకు భోజనం పెట్టడం.. దగ్గర్నుంచి స్నానం చేయించడం, బయటకు తీసుకెళ్లడం వరకు అన్నీ ఆమే చూసుకునేది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Andhra Pradesh: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అయితే.. ఐదు రోజుల క్రితం కుక్క ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో.. ఏమీ తినకుండ ఉండటంతో కుక్క చనిపోయింది. అయితే.. ఆ కుక్కకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. కుక్క చనిపోయిన దగ్గరినుంచి తన కూతురు ఏడుస్తూనే ఉందని తల్లి అస్మీన్ చెప్పింది. అప్పటి నుంచి సరిగ్గా తిండి కూడా తినలేదని.. ఆమెను ఎంత బుజ్జగించినా, బాధ పడటం మానేదికాదని తల్లి చెప్పింది. స్కూల్ కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా బాలిక మౌనంగా వుండేదని చెప్పింది.
కాగా.. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాను బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి గదిలో ఉరి వేసుకుని కనిపించిందని ఆస్మిన్ చెప్పింది. ఈ ఘటనపై పోలీసులకు విషయం తెలువడంతో.. అక్కడికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. తన పెంపుడు కుక్క చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
మరోవైపు.. పిల్లలు ఏదైనా కోల్పోయి మౌనంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు. పిల్లలు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండనివ్వకూడదని అంటున్నారు. పిల్లలతో మాట్లాడి వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. లేదంటే.. డాక్టర్‌తో కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరుతున్నారు.
Uttar Pradesh: తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని అత్తపై కోడలు ఒత్తిడి.. వీడియో వైరల్..
- Tags
- died
- girl
- Pet Dog
- suicide
- telugu news
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!