మెదక్ లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే కుట్ర చేస్తుందని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మోడీ మారుస్తాడని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు.. అంబేడ్కర్ మళ్ళీ పుట్టి వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలని చూసినా.. మార్చడం జరగదు అని ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారని రఘునందన్ రావు పేర్కొన్నారు.
KTR: 12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుంది..
పదేళ్లు అధికారంలో ఉన్నా రాజ్యాంగం మార్చలేదు.. మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాజ్యాంగం మార్చమని రఘునందన్ రావు తెలిపారు. ఇప్పటికీ 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది.. అందులో మెజారిటీ సార్లు కాంగ్రెస్ హయాంలో జరిగిందన్న విషయం సీఎం గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేశారు. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో లేకున్నా.. ఇందిరాగాంధీ ఆనాడు రాజ్యాంగంలో చేర్చిందన్నారు. అంబేడ్కర్ ని ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ పార్టీ.. ఆయనికి భారత రత్న ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు రాలేదని తెలిపారు. సీఎం రేవంత్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని దుయ్యబట్టారు.
Konda Vishweshwar Reddy: రాహుల్ గాంధీ హిందువుల ప్రతినిధి కాదా..?
మరోవైపు.. బీఆర్ఎస్ పై రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. జై శ్రీ రామ్ అంటే కేసీఆర్, కేటీఆర్ కి నొప్పి ఎందుకు అని ప్రశ్నించారు. జై శ్రీ రాం కాకుండా.. జై కేసీఆర్ అనాలా అని విమర్శించారు. కేసీఆర్ వంద అబద్దాలు ఆడితే.. రేవంత్ వెయ్యి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాడని పేర్కొన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి అబద్ధాల్లో అవిభక్త కవలలని తీవ్ర విమర్శలు గుప్పించారు.