Pawan Kalyan: వైసీపీని ఓడించి తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ ఒక్కసారి ఛాన్స్ అడిగితే ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మీ భవిష్యత్ కోసం ఛాన్స్ తీసుకోండని అన్నారు. వైసీపీని ఓడించి అప్పుడు తగ్గేది లేదని మెగా ఫ్యాన్స్ నిరూపించాలని తెలిపారు. లే అవుట్లు వేయాలన్నా.. ఇళ్ళు కట్టాలన్నా వైసీపీ వాళ్లకు లంచాలు ఇవ్వాలని చెప్పారు. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాల బాబు అని విమర్శించారు. సింహాచలం భూమి ఆక్రమించి ఎమ్మెల్యే భారీ భవంతి కడితే అడిగే దిక్కు లేదని పేర్కొన్నారు. కన్నబాబు రాజు లాంటి ఎమ్మేల్యేలు అధికారంలో ఉంటే ఎన్ని రాజ్యాంగాలు ఉన్నా న్యాయం జరగదని పవన్ కల్యాణ్ తెలిపారు.
Maldives: మాల్దీవుల్లో పెరుగుతున్న మతోన్మాదం.. ఇద్దరు భారతీయులు, ఇజ్రాయిల్ యువతిపై దాడి..
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
కూటమి అభ్యర్థులను గెలిపించండి.. వాళ్ళంతా బాధ్యతా యుతంగా ఉండేలా చూసే బాధ్యత తనదని అన్నారు. దోపిడీ దారుడుతో పోరాటం కోసం ప్రజల గుండె చప్పుడు అయ్యాను.. జనసేనను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా మార్చడం మన మొదటి పని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ తర్వాత సీఎం అవడం కాలం నిర్ణయిస్తుంది.. అప్పటి వరకు ప్రజల తరపున ముఠా కూలీగా పనిచేస్తానని భరోసానిచ్చారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీలో తొలిసారి స్కిల్ గణాంకాలు తీసుకుని వాటి ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Pushpa 2 : గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప2 మాస్ టైటిల్ సాంగ్..
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ రాబోతోందని పవన్ కల్యాణ్ చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని విమర్శించారు. అన్ని చట్టాలు ఉంటేనే భూములు కబ్జాలు ఆగడం లేదు.. టైటిలింగ్ యాక్ట్ వస్తే నష్టం తప్పదని సూచించారు. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నీ గాలిలో దీపం లాంటిదని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా చేసే వాళ్ళను మొకాళ్ళ మీద కూర్చోబెడదామన్నారు. లా& ఆర్డర్ పరిరక్షణ కూటమి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చెందాల్సిన సహజవనరులు దోపిడీకి గురయ్యాయని.. భవిష్యత్ తమదేనని పవన్ కల్యాణ్ తెలిపారు.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!