మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తే బీజేపీ సహించదని అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎన్‌డిఎ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు.
పెళ్లంటే ఎంతో హడవిడి ఉంటుంది. అనుకున్న సమయానికి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం పెళ్లి ఏర్పాట్లు చకాచకా కానిస్తారు. కానీ.. ఇక్కడ ఓ వింత ఘటన జరిగింది. వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన బీహార్‌లోని కటిహార్‌లో జరిగింది. అంతేకాకుండా.. పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చైన రూ. 4 లక్షలు ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులను డిమాండ్ చేసింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలం కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏజ్ఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశంలో పాల్గొన్నారు.
కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తరగతులు, రాత్రిపూట స్వీయ చదువులు, వారానికి ఒకటి రెండుసార్లు పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాలు, తోటివారితో పోటీ ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా.. మూడు రోజుల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.
ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. పాఠశాల విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తరగతి గదుల్లో ఒకదానిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు ఉపాధ్యాయుడు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో వైరల్‌గా మారింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఆయన చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కాగా.. ఈ ఫేక్ వీడియోపై బీజేపీ వెంటనే చర్యలు తీసుకుంది. ఈ నకిలీ వీడియోపై హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. చౌకబారు రాజకీయాలు చేస్తూనే కాంగ్రెస్ ఈ కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపించింది. ఇంతకీ ఈ కేసులో ఏం…
లండన్ (లండన్ స్టబ్)లో చాలా ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్‌లో ఓ వ్యక్తి కత్తితో ప్రజలు, పోలీసులపై దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడే ముందు దుండగుడు తన కారును ఓ ఇంట్లోకి తీసుకెళ్లి.. అక్కడున్న వారిపై దాడి చేశాడని పేర్కొన్నారు. కాగా.. 36 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కూడా ఆ వ్యక్తి చాలా మంది వ్యక్తులు, పోలీసులపై దాడికి పాల్పడ్డాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్కతా విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సాధించింది. కోల్కతా బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్ (68) రన్స్ చేయడంతో కేకేఆర్ అలవోకంగా విజయం సాధించింది. కోల్కతా బ్యాటింగ్ లో సునీల్ నరైన్ (15), రింకూ సింగ్ (11) పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (33*), వెంకటేష్ అయ్యర్ (26*) పరుగులతో రాణించడంతో గెలుపును నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లలో…
దక్షిణ అమెరికా పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు నదిలో పడి 23 మంది మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడటంతో ప్రయాణికులంతా నదిలో మునిగిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారనే సమాచారం ఇంకా తెలియరాలేదు.