అమెరికా-వెస్టిండీస్ లో జూన్ 2న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కాగా.. ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్ కు వెళ్లే నాలుగు జట్ల గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు. అయితే.. ఆ జట్లలో టీమిండియాకు స్థానం కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం. సోషల్ మీడియా వేదికగా అతడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
మైఖేల్ వాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో టీ20 ప్రపంచ కప్‌లో నలుగురు సెమీ-ఫైనలిస్ట్‌లను అంచనా వేశారు. వాన్ తన అధికారిక ట్విట్టర్‌లో నాలుగు టీమ్ లు సెమీస్ కు చేరుకుంటాయో చెప్పాడు. అందులో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి. టీమిండియా సెమీస్ లిస్ట్ లో ప్రకటించలేదు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ అన్నీ సూపర్ 8కి అర్హత సాధిస్తే.. వారు ఒకే గ్రూప్‌లో ఉంటారు కాబట్టి ఇది అసాధ్యమని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
Delhi School Bomb Threat: ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపు.. పాక్ ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్‌తో లింక్..
టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా, హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. టీ20 ప్రపంచకప్ 2024లో ఐర్లాండ్‌తో జూన్ 5న భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత భారత జట్టు జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
మరోవైపు.. రింకూ సింగ్, కేఎల్ రాహుల్‌లను భారత జట్టు నుంచి తప్పించడంపై అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రింకూ సింగ్ కంటే శివమ్ దూబేకి ప్రాధాన్యత ఇచ్చారు. భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లు చోటు దక్కించుకున్నారు. భారత జట్టు పేస్ అటాక్ కూడా చాలా బలహీనంగా కనిపిస్తోంది. అందుకే జట్టు ఎంపికపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రానున్న టోర్నీలో భారత జట్టు ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
My 4 Semi finalists for the T20 WC … England,Austrlalia,South Africa and the West Indies .. #T20WC2024
— Michael Vaughan (@MichaelVaughan) May 1, 2024