RCB vs GT: గుజరాత్పై ఆర్సీబీ విక్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 148 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఒకానొక సమయంలో ఆర్సీబీ వికెట్లు పోతున్న సమయంలో గుజరాత్ వైపు మ్యాచ్ తిరిగింది. కానీ.. దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చి మ్యాచ్ను గెలిపించాడు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ (42), డుప్లెసిస్ (64) పరుగులు చేయడంతో ఆర్సీబీ అలవోకంగా విజయం సాధించింది.
Off The Record: ధర్మవరంలో మ్యూట్ మోడ్‌లో బీజేపీ వరదాపురం సూరి
ఈ మ్యాచ్లో డుప్లెసిస్ వీర విహరం చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 64 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 3 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. డుప్లెసిస్ వికెట్ కోల్పోగానే ఆర్సీబీ బ్యాటర్లు వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. విల్ జాక్స్ (1), రజత్ పాటిదార్ (2), మ్యాక్స్ వెల్ (4), కెమెరాన్ గ్రీన్ (1) పరుగులు చేయడంతో మ్యాచ్ ఓడిపోతుందనే అనుకున్నారు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ (21*), స్వప్నిల్ సింగ్ (15*) పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించారు. గుజరాత్ బౌలింగ్లో జోష్ లిటిల్ 4 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Dadisetti Raja: సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో జగన్ చూపించారు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటింగ్లో షారుఖ్ ఖాన్ (37) టాప్ స్కోరర్ కాగా.. రాహుల్ తెవాటియా (35), డేవిడ్ మిల్లర్ (30) పరుగులు చేశారు. సాహా (1), శుభమాన్ గిల్ (2), సాయి సుదర్శన్ (6), రషీద్ ఖాన్ (18), విజయ్ శంకర్ (10), మానవ్ సుతార్ (1) రన్స్ చేశారు. బెంగళూరు బౌలింగ్లో సిరాజ్, యష్ దయాల్, విజయ్ కుమార్ వైశాఖ్ తలో రెండు వికెట్లు సంపాదించారు. ఆ తర్వాత.. కెమెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మ చెరో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!