Rajesh Veeramalla
Author- NTV Telugu-
Flights Cancelled: రెమల్ తుఫాను ఎఫెక్ట్.. 14 విమానాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో రెమల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ తుఫాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. రెమల్ తుఫాను నేపథ్యంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లే 14 విమానాలను రద్దు చేసింది. తుఫాను కారణంగా పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు రద్దు చేసినట్లు గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. -
Snakes: ఓ ఇంట్లో బాత్రూమ్లో 30కి పైగా పాములు.. చూస్తే గూస్బంప్సే
పాములంటే సాధారణంగా అందరికీ భయమే.. వాటిని చూస్తే కొందరికైతే చెమటలు పట్టేస్తాయి. ఎక్కడో దూరం నుంచి చూసినా కానీ.. కొందరు భయపడిపోతారు. అయితే.. సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వస్తుండటంతో కాస్త భయం తగ్గుతుంది. అయినప్పటికీ రియల్గా పామును చూస్తే భయపడే వారు ఎంతో మంది ఉన్నారు. -
Pakisthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళలు, చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని ముజఫర్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీస్ 1122 ప్రకారం.. ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఢీకొనడంతో చాలా మంది అక్కడికక్కడే మరణించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెస్క్యూ టీమ్, స్థానిక… -
Kaviya Maran: మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు.. బాధలో ఉండొద్దు
ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో.. ఎస్ఆర్హెచ్ టీమ్ మొత్తం తీవ్ర నిరాశలో ఉంది. ఈ క్రమంలో.. తమ ప్లేయర్లకు జట్టు యజమాని కావ్యా మారన్ ధైర్యం నింపారు. 'మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. టీ20 క్రికెట్ ఎలా ఆడాలో నిరూపించారు. ఆరెంజ్ ఆర్మీ అభిమానులంతా కాలర్ ఎగిరేసేలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఫైనల్లో ఓడటం బాధాకరం. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో రాణించారని చెప్పుకొచ్చింది. -
Polling: 35 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు..
గత 35 ఏళ్ల తర్వాత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్న మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 58.46 శాతం ఓటింగ్ నమోదైందని పోల్ ప్యానెల్ పేర్కొంది. 2019తో పోల్చితే కశ్మీర్ లోయలో 30 శాతం భారీగా పెరిగిందని తెలిపింది. ఈ నిర్ణయం త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సానుకూలంగా ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు -
Independents: తగ్గుతున్న స్వతంత్రుల ప్రాబల్యం.. 1957 నుంచి 2019 వరకు గణాంకాలు ఎలా ఉన్నాయంటే..?
లోక్సభ ఎన్నికల్లో స్వతంత్రుల ప్రాబల్యం తగ్గుతోంది. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయపతాకం ఎగురవేశారు. 1957 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్ర ఎంపీలు గెలుపొందారు. కానీ 2019లో ఈ సంఖ్య కేవలం నలుగురు స్వతంత్ర ఎంపీలకు తగ్గింది. దేశంలో అత్యల్ప స్వతంత్ర ఎంపీల సంఖ్య 2014లో కేవలం ముగ్గురు మాత్రమే నిలిచారు. -
Amit Shah: కాంగ్రెస్ 40 సీట్లు దాటదు.. సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు కూడా రావు
ఉత్తర ప్రదేశ్లోని బల్లియాలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని.. ఆరో దశలో 400 దాటిందని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని దుయ్యబట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని ఆరోపించారు. -
Prajwal Revanna: మే 31న పోలీసుల ఎదుట హాజరవుతా.. విచారణకు సహకరిస్తా
తన సెక్స్ టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తనపై లైంగిక వేధింపుల కేసుల నేపథ్యంలో కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే.. దాదాపు అతను దేశం విడిచి వెళ్లి నెల దాటిపోయింది. అయితే.. తాజాగా కీలక కథనం బయటికొచ్చింది. మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరుకానున్నట్లు ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. 'నన్ను తప్పుపట్టవద్దు, 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతాను, సహకరిస్తాను. న్యాయవ్యవస్థను నమ్ముతాను, ఇవి… -
Maharashtra: విషాదం.. పాదచారులపైకి దూసుకెళ్లిన డంపర్, ఇద్దరు మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన డంపర్ ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన ఈరోజు (సోమవారం) ఉదయం జరిగింది. -
Rahul Gandhi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తాం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాట్నాలోని భక్తియార్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూన్ 4న ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకాన్ని అంతం చేస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!