తన సెక్స్ టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తనపై లైంగిక వేధింపుల కేసుల నేపథ్యంలో కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే.. దాదాపు అతను దేశం విడిచి వెళ్లి నెల దాటిపోయింది. అయితే.. తాజాగా కీలక కథనం బయటికొచ్చింది. మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరుకానున్నట్లు ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. ‘నన్ను తప్పుపట్టవద్దు, 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరవుతాను, సహకరిస్తాను. న్యాయవ్యవస్థను నమ్ముతాను, ఇవి నాపై తప్పుడు కేసులు. చట్టాన్ని నమ్ముతున్నాను’ అని ఓ మీడియాతో చెప్పినట్లు సమాచారం.
Read Also: Maharashtra: విషాదం.. పాదచారులపైకి దూసుకెళ్లిన డంపర్, ఇద్దరు మృతి
జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు అయిన 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ.. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన పలు సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలువురి మహిళలను లైంగికంగా వేధించిన పలు వీడియోలు బయటకు రావడంతో ఏప్రిల్ 26న అతను దేశం విడిచి వెళ్లిపోయాడు. కాగా.. ఈ ఆరోపణలను రేవణ్ణ ‘రాజకీయ కుట్ర’ అని పేర్కొన్నాడు. తాను డిప్రెషన్లో ఉన్నానని.. తన ఆచూకీ చెప్పనందుకు పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ రేవణ్ణ క్షమాపణలు చెప్పారు.
Read Also: Rahul Gandhi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తాం..
ప్రజ్వల్ విదేశాలకు పరారై నెల రోజులైంది. ఇప్పటి వరకు అతని ఆచూకీని స్పెషల్ ఇన్విస్టిగేషన్ ఫోర్స్ గుర్తించలేకపోయింది. నాలుగు సార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ బహిరంగ విన్నపాలు చేశారు.