ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో.. రైతులు షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. తోపులాట జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం స్పందించారు. ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చదరగొట్టారన్నది అవాస్తవం…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్స వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు. అనంతరం.. పలు విషయాలపై చర్చించనట్లు సమాచారం. కాసేపటి క్రితమే సోనియా గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నారు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఏసీబీ అధికారులు మారువేషాల్లో వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. లారీ డ్రైవర్లుగా వేషం మార్చుకుని చెక్పోస్ట్ల దగ్గర తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్ పోస్టులలో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ శివారులో పసి పిల్లల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మేడిపల్లి కేంద్రంగా పసి పిల్లల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతున్నాడు. ఒక్కో పిల్లాడిని రూ. 5 లక్షల వరకు అమ్ముతుంది ఈ ముఠా. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం ఈ విషయాన్ని గుట్టురట్టు చేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని ముఠాను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో తల్లీకొడుకుతో పాటు ఇద్దరు…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తరువాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది అని తాను ముందే చెప్పానని తెలిపారు. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టామని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ టాపింగ్ పై సమీక్ష జరపలేదని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని.. దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హార్డ్ డిస్క్లను…
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన లైవ్-ఇన్ పార్ట్‌నర్ మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆమె అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి రోడ్డుపై వదిలేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం చందన్ నగర్ ప్రాంతంలో గోనె సంచిలో 57 ఏళ్ల మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నందిని శర్మ తెలిపారు.
లైంగిక నేరాల ఆరోపణల తర్వాత గత నెలలో జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ.. తన భర్తను ఇంతకుముందు అరెస్టు చేసిన కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌డి రేవణ్ణను ఏప్రిల్ 29న ఇంటి పనిమనిషిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేశారు. హెచ్‌డి రేవణ్ణ కిడ్నాప్ చేసిన మహిళ తమ ఇంటిలో పని చేస్తుందని.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి కుమారుడు తెలిపాడు. ఈ క్రమంలో.. హెచ్‌డి…