Polling: 35 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 35 ఏళ్ల తర్వాత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్న మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 58.46 శాతం ఓటింగ్ నమోదైందని పోల్ ప్యానెల్ పేర్కొంది. 2019తో పోల్చితే కశ్మీర్ లోయలో 30 శాతం భారీగా పెరిగిందని తెలిపింది. ఈ నిర్ణయం త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సానుకూలంగా ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. తద్వారా యూనియన్ టెరిటరీలో ప్రజాస్వామ్య ప్రక్రియ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. శనివారం.. CEC కుమార్ మీడితో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికలలో జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఓటింగ్ శాతం పెరిగిందని, కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే ప్రక్రియను ఎన్నికల సంఘం అతి త్వరలో ప్రారంభిస్తుందని చెప్పారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
లోయలోని మూడు స్థానాలు: శ్రీనగర్ లో 38.49, బారాముల్లా 59.1, అనంతనాగ్-రాజౌరీలో 54.84 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత మూడు దశాబ్దాల కంటే అత్యధికం. యుటిలోని రెండు స్థానాలు: ఉధంపూర్ 68.27, జమ్మూలో 72.22 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని.. ప్రజాస్వామ్యాన్ని పెద్దఎత్తున స్వీకరించారని ఎన్నికల సంఘం తెలిపింది.
Independents: తగ్గుతున్న స్వతంత్రుల ప్రాబల్యం.. 1957 నుంచి 2019 వరకు గణాంకాలు ఎలా ఉన్నాయంటే..?
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే 18-59 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు.. UTలో అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక పోల్ శాతం ప్రజాస్వామ్యంపై వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని.. ఇది సానుకూల, హృదయపూర్వక పరిణామమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈసీ ప్రకారం.. కేంద్ర పాలిత ప్రాంతంలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో 18-59 ఏళ్ల వయస్సు గల వారు 80 శాతానికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!