కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాట్నాలోని భక్తియార్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూన్ 4న ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకాన్ని అంతం చేస్తామని పేర్కొన్నారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో డీజేను ఓ వ్యక్తి గన్తో కాల్చి చంపాడు. ఈ ఘటన సోమవారం (మే 27) తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఒక బార్‌లో వివాదం కారణంగా డీజే హత్యకు గురయ్యాడు. హత్యకు సబంధించిన ఘటన అక్కడి కెమెరాలో రికార్డైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్‌లో 4-5 వ్యక్తులు, డీజే సందీప్ మరియు బార్ సిబ్బందితో మ్యూజిక్ ప్లే చేయడం గురించి గొడవ జరిగింది. మొదట్లో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం…
తమిళనాడులో ఓ సెప్టిక్ ట్యాంక్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. మధురైలోని ఉర్దూ ప్రమోషన్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు హత్య చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. అనంతరం బాలుడి మృతదేహాంపై సమాచారం అందడంతో అందులో నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధురైలోని కథపట్టి గ్రామంలో చోటు చేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లో రెమల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో బెంగాల్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా.. తుఫాన్ ఎఫెక్ట్తో బెంగాల్ తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ఆస్తికి విస్తృతమైన నష్టాన్ని చవిచూశాయి. రెమల్ తుఫాను బెంగాల్ రాష్ట్రం పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో గంటకు 135 కిమీ వేగంతో గాలులు వీచినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సెంట్రల్ కోల్‌కతాలోని ఎంటల్లీలోని బిబీర్ బగాన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గోడ కూలిపోవడంతో…
ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో మాలెగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై కాల్పులకు పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీకి మాలిక్ ప్రముఖ నాయకుడిగా ఉన్నారు.
ఐపీఎల్ 2024 విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. ఫైనల్స్లో సన్ రైజర్స్ను ఓడించి 3వ సారి కప్ను సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా.. కేవలం 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కోల్కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (52*) పరుగులతో రాణించాడు. గుర్బాజ్ (39), సునీల్ నరైన్ (6), శ్రేయాస్ అయ్యర్ (6*) పరుగులు చేశారు. దీంతో.. కోల్కతా సూపర్ విక్టరీ సాధించింది. సన్ రైజర్స్ బౌలింగ్లో కమిన్స్,…
ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్కతా బౌలింగ్కు సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 18.3 ఓవర్లలో ఆలౌటైంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో మొదట నుంచి బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. మొదట్లోనే ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ (2) వికెట్లు పోవడంతో జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి ఆదుకుంటాడనకున్నప్పటికీ (9) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
కొత్వాలి సెక్టార్-24 ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కంచన్‌జంగా మార్కెట్ సమీపంలో వేగంగా వస్తున్న ఆడి కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందాడు. కారు వేగంగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టడంతో.. కాసేపు గాలిలో ఉండి పది మీటర్ల దూరంలో పడిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంపై మృతుడి కుమారుడు గుర్తు తెలియని డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడారా.. లేక విభేదాల కారణంగా భార్యను హతమార్చి భర్త ఉరేసుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతానికి చెందిన చక్రవర్తుల శ్రీధర్(28)కు అదే జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన దేవి(24)తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి బాబు (7) పాప(6). ఈ కుటుంబం మూడేళ్ల కిందట రాజమండ్రి వచ్చి ఆనందనగర్ లో ఉంటోంది. శ్రీధర్ తాపిమేస్త్రీ. రెండేళ్లకు దంపతుల మధ్య విభేదాలు…
ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఉదయం పదిగంటలు దాటిన తర్వాత భానుడి భగభగలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు (సోమవారం) 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎల్లుండి (మంగళవారం)…