Kaviya Maran: మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు.. బాధలో ఉండొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో.. ఎస్ఆర్హెచ్ టీమ్ మొత్తం తీవ్ర నిరాశలో ఉంది. ఈ క్రమంలో.. తమ ప్లేయర్లకు జట్టు యజమాని కావ్యా మారన్ ధైర్యం నింపారు. ‘మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. టీ20 క్రికెట్ ఎలా ఆడాలో నిరూపించారు. ఆరెంజ్ ఆర్మీ అభిమానులంతా కాలర్ ఎగిరేసేలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఫైనల్లో ఓడటం బాధాకరం. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో రాణించారని చెప్పుకొచ్చింది.
Swati Maliwal Case: బిభవ్ కుమార్ కు కోర్టు షాక్..బెయిల్ పిటిషన్ తిరస్కరణ
Also Read
‘గాయ్స్ మీరంతా మేం తల ఎత్తుకునే ప్రదర్శన చేశారు. ఈ విషయం చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రతీ ఒక్కరు మన గురించి మాట్లాడుకునేలా చేశారు. దురదృష్టవశాత్తు ఈ రోజు మనకు కలిసి రాలేదు. కానీ మీరు మాత్రం అసాధారణ ప్రదర్శన కనబర్చారు. గతేడాది చివరి స్థానంలో నిలిచాం. అయినా అభిమానులంతా భారీ సంఖ్యలో మన మ్యాచ్‌లకు హాజరయ్యారంటే మీ అసాధారణ ప్రదర్శనే కారణం. ప్రతీ ఒక్కరు మన అద్భుత ప్రదర్శన గురించి మాట్లాడుకుంటున్నారు. కేకేఆర్ టైటిల్ గెలిచినా.. అందరూ మీ గురించే మాట్లాడుతున్నారు’ అని చెప్పింది.
Polling: 35 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు..
‘ఆ రీతిలో మనం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాం. మరోసారి అందరికీ ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఇలా బాధగా ఉండకండి. మనం ఫైనల్స్ ఆడాం. ఇది ఇతర గేమ్స్‌లా మాములు మ్యాచ్ కాదు. లీగ్‌లోని ఇతర జట్లు కూడా ఈ మ్యాచ్‌ను చూశాయి. థ్యాంక్యూ త్వరలో మళ్లీ కలుస్తాను’ అని కావ్యా మారన్ చెప్పుకొచ్చింది. కాగా.. కావ్య మారన్ మాట్లాడిన వీడియోను ఎస్ఆర్హెచ్ విడుదల చేసింది. కాగా.. ఫైనల్లో కేకేఆర్ చేతిలో సన్ రైజర్స్ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే.
"You've made us proud." 🧡
– Kaviya Maran pic.twitter.com/zMZraivXEE
— SunRisers Hyderabad (@SunRisers) May 27, 2024
- Tags
- final
- IPL 2024
- Kaviya Maran
- kkr
- proud
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!