తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. తెలంగాణా గీతం, తెలంగాణ లోగో ఎంపిక పై వారిద్దరూ చర్చిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో.. గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష చేపట్టారు. సాయంత్రం వరకు పాటకు సంబంధించి పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.…
బాంబ్ బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు టాస్క్ఫోర్స్ పోలీసులు. నిందితుడు గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించి.. అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పంజాగుట్ట ప్రజా భవన్ లో, నాంపల్లి కోర్టులో బాంబ్ పెట్టాము అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి టెన్షన్ క్రియేట్ చేశాడు రామకృష్ణ. అయితే.. నిందితుడు భార్యతో గొడవ పడి మధ్యనికి బానిసగా మారి, భార్య లేదన్న బాధలో ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రజల దృష్టి మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ను తెర పైకి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సర్కస్లో జోకర్గా అవసరం అయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంను తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటి వరకు సీఎం, మంత్రులు మాట్లాడలేదు.. కానీ లీకులు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టపరంగా జరగాల్సింది జరుగుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కాంగ్రెస్ వాళ్ళు…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తన షాపుల వద్ద రైతులు పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు చేత పట్టుకొని విత్తనాల కోసం క్యూ కట్టారు. మండుతున్న ఎండలో విత్తనాల కోసం రైతుల కష్టాలు పడుతున్నారు. కొద్ది షాపుల్లో స్టాక్ ఉండటంతో.. రైతులు భారీగా బారులు తీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా నిలబడితే కేవలం ప్యాకెట్లు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 659 అనే రకం విత్తనాలే కావాలని రైతులు కోరుతున్నారు.
అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుర్కపల్లి జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం 2023లో శామీర్ పేట్ గ్రామానికి చెందిన దూడల నాగేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అందులో నుంచి రూ.4 లక్షల…
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డీసీపీ రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్లో తన పేరు ఉందని చెప్పాడన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని నిన్నటి నుండి చాల బాధపడ్డానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్తో మాజీ ముఖ్యమంత్రి, కేటీఆర్, హారీష్ రావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ నీచాతి నీచమైన చర్య అని మండిపడ్డారు. నా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి నేనేమైనా తీవ్రవాదినా? అని ఎమ్మెల్యే…
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రోసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజ్ కార్పోరేషన్ కు ఉందని.. ఈ…
మాజీ క్రికెట్ దిగ్గజం, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. గంభీర్తో బీసీసీఐ సుధీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. గంభీర్తో 4 గంటలపాటు బీసీసీఐ సెక్రటరీ జైషా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గంభీర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా.. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ కి 3 సార్లు టైటిల్ అందించాడు గంభీర్. 2012, 2014లో గంభీర్ కెప్టెన్గా ఉన్నప్పుడు కేకేఆర్ కి టైటిల్ అందించి పెట్టాడు. తాజా సీజన్లో టైటిల్ సాధించిన…
హర్యానాలోని సోనిపట్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఆ సమయంలో.. ఫ్యాక్టరీలో ఉన్న సిలిండర్లు మంటలు అంటుకుని పేలాయి. దీంతో.. మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా కార్మికులు మంటల్లో చిక్కుకుని కాలిపోయారు. అయితే.. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీలో మంటల్లో చిక్కుకున్న కార్మికులను కొంతమందిని రక్షించారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి…