మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన డంపర్ ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన ఈరోజు (సోమవారం) ఉదయం జరిగింది.
Read Also: Rahul Gandhi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తాం..
వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 9.30 గంటల ప్రాంతలో తమ పనుల నిమిత్తం కార్యాలయానికి వెళ్తుండగా రాంగ్ రూట్ లో అతి వేగంతో వచ్చి వారిని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. వసాయి ప్రాంతంలోని సతివాలి వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఈ ఘటనలో రెండు బస్సులు, మరో మూడు వాహనాలను ఢీకొట్టింది. కాగా.. డంపర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Ranchi: బార్‌లో మ్యూజిక్ వివాదం.. డీజేను గన్తో కాల్చి చంపిన వ్యక్తి
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు వ్యక్తులు డంపర్ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డంపర్ డ్రైవర్‌పై ఇండియన్ పీనల్ కోడ్, మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.