కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ పోరు జరుగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈదురుగాలుల బీభత్సానికి తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫారం ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో గోడ మీద పడటంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. రెండు గంటలుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్, సీనియర్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో బంతితో 14,000 పరుగులు మరియు 700 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు నిలిచాడు. యూఎస్ వర్సెస్ బంగ్లాదేశ్ 3వ టీ20 మ్యాచ్ సందర్భంగా షకీబ్ ఈ రికార్డును సాధించాడు. కాగా.. ఇప్పటి వరకు 48 మంది బ్యాటర్లు 14,000 పరుగులు చేశారు. 17 మంది బౌలర్లు 700 వికెట్లు పడగొట్టారు. కానీ ఈ రెండింటినీ సాధించిన ఒకే ఒక్క ఆటగాడిగా షకీబ్ అల్ హసన్…
విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీసులు ఇవ్వనున్నారు. మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్కు లీగల్ నోటీసు జారీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నంలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి వారిపై చేసిన అసత్యమైన, నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్/రిజాయిండర్ ఇవ్వడమైనది.
'రెమాల్' తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర తుపాను 'రెమల్' హెచ్చరికల మధ్య కోల్కతాలో వర్షం ప్రారంభమైంది. ఈ మేరకు వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. ముందస్తు రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతంలో తుఫాను రావడం ఇదే తొలిసారి. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 'రెమల్' ఉత్తర బంగాళాఖాతం, ఖేపుపారాకు 220 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా.. సాగర్‌కు 210 కి.మీ…
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ 15 ఏళ్ల యువకుడిపై పలుమార్లు అత్యాచారం చేశాడు 46 ఏళ్ల వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని బాలుడు హత్య చేశాడు. అనంతరం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హకీమ్ నజాకత్ అనే వ్యక్తి అసభ్యకరమైన వీడియోను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడంతో యువకుడు కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మే 19న నజకత్ భార్య, అతని పిల్లలు తన తల్లి ఇంటికి వెళ్లింది. అయితే ఆ…
కర్నూలు జిల్లాలో ఒకే రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వజ్రాల కోసం పలువురు రోజుల తరబడి ప్రయత్నాలు చేస్తుంటారు. జిల్లాలోని తుగ్గలి (మం) జొన్నగిరిలో ఒకేరోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఒక వజ్రానికి 6 లక్షలు ఆరు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. మరో వజ్రాన్ని నిర్వాహకులు ఇంకా వేలం వేయలేదు. ఈ వజ్రం విలువ రూ. 12 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వారం రోజుల్లో గుట్టు చప్పుడు కాకుండా 10 వజ్రాలు కొనుగోలు…
కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించండని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న…
ఐపీఎల్ 2024 ఎండ్కార్డ్ పడే సమయం దగ్గర పడింది. ఆదివారం నాడు (మే 26 ) కోల్‌కతా-హైదరాబాద్ మధ్య ఫైనల్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ప్యాట్ కమిన్స్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. అయితే టీవీలో ధోనీ కొట్టిన సిక్స్.. కమిన్స్ దృష్టిని టీవీ వైపు మళ్లించింది. ఫైనల్ మ్యాచ్ కు ముందు ఈరోజు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు వేచి చూస్తుండగా.. అతనికి ఎడమవైపులో ఉన్న టీవీలో ధోనీ సిక్స్ కొట్టిన వీడియో ప్లే అవుతుంది.…