ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై చేసిన ఆరోపణపై చర్చించడానికి రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం ఇండియా కూటమి నేతలను కోరారు. ఈ క్రమంలో కూటమి నేతలకు లేఖ రాశారు. ఆ లేఖలో.. తనపై దుర్వినియోగానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అవమానించడం, హత్యకు ప్లాన్ చేశారని లేఖలో పేర్కొంది. “నా పాత్రపై ఎడతెగని దాడులను ఎదుర్కొన్నాను.. అంతేకాకుండా.. నా స్వంత పార్టీ నాయకులు, వాలంటీర్లు.. నా ప్రతిష్ట, పాత్ర, విశ్వసనీయతను అణగదొక్కడానికి ఒక స్మెర్ ప్రచారం నిర్వహించారు.” అని మలివాల్ తన లేఖలో రాశారు.
Read Also: Hyderabad : శ్రీ సీతారాముల ఆలయంలో స్వామివారి విగ్రహాలు ధ్వంసం..
‘గత నెల రోజులుగా, న్యాయం కోసం పోరాటంలో బాధితులు ఎదుర్కొనే బాధను,యు ఒంటరితనాన్ని నేను వ్యక్తిగతంగా అనుభవించాను. ఈ క్రమంలో.. దీనిపై చర్చించడానికి నేను మీ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు” లేఖలో తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్‌లకు రాసిన లేఖలను మలివాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమె చేసిన పనిని ప్రస్తావిస్తూ.. తనకు జరిగిన సంఘటన గురించి ఆమె వారికి చెప్పారు.
Read Also: Minister Satya Kumar Yadav: ఏపీకి దీపావళి ముందే వచ్చింది.. రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచుతాం
‘‘గత 18 ఏళ్లుగా గ్రౌండ్ లో పని చేశాను.. 9 ఏళ్లలో మహిళా కమిషన్‌లో 1.7 లక్షల కేసులు విన్నాను.. ఎవరికీ భయపడకుండా, ఎవరికీ తలవంచకుండా మహిళా కమిషన్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టాను.. కానీ.. ముఖ్యమంత్రి ఇంట్లో నన్ను దారుణంగా కొట్టారని, తర్వాత తన పరువు తీసినందుకు చాలా బాధగా ఉందని” తెలిపారు. “ఈ రోజు, నేను ఈ విషయమై భారత కూటమిలోని పెద్ద నాయకులందరికీ లేఖ రాశాను. అందరితో అపాయింట్‌మెంట్ కోరాను” అని ఆమె పోస్ట్‌తో పాటు రాసింది.