రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలను చూసి లోక్ పైలట్ అప్రమత్తతో ట్రైన్ ఆపి వాటి ప్రాణాలను కాపాడాడు. దాదాపు 10 సింహాలు ట్రాక్ పై నిద్రిస్తుండగా.. అది చూసిన లోకో పైలట్ సడన్ గా బ్రేకులు వేశాడు. దీంతో వాటి ప్రాణాలను రక్షించాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ సమీపంలో జరిగింది. లోకో పైలట్ ముఖేష్ కుమార్ మీనా గూడ్స్ రైలును పిపావావ్ పోర్ట్ స్టేషన్ నుండి ప్రధాన కారిడార్ పక్కన ఒక చిన్న ట్రాక్ పై వస్తున్నాడు. అయితే.. “ట్రాక్‌లపై విశ్రాంతి తీసుకుంటున్న 10 సింహాలను గుర్తించిన వెంటనే మీనా ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. అంతేకాకుండా.. సింహాలు లేచి పట్టాలపై నుంచి వెళ్లే వరకు వేచి ఉండి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. లోకో పైలట్ చేసిన ఈ పనిపై పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు.
Kishan Reddy : జమ్మూ & కాశ్మీర్‌కు బీజేపీ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి..
కాగా.. సింహాలతో సహా వన్యప్రాణుల భద్రత కోసం భావ్‌నగర్ డివిజన్ అనేక చర్యలు చేపడుతుంది. ఈ మార్గంలో వెళ్లే.. లోకో పైలట్‌లు అప్రమత్తంగా ఉంటారు.. అంతేకాకుండా.. నిర్దేశించిన వేగ పరిమితి ప్రకారం రైళ్లను నడుపుతారని రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. అభయారణ్యం చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో పులులు తిరుగుతాయని అధికారులు తెలిపారు.
Payyavula Keshav: రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు కూలీగా పని చేస్తా..
మరోవైపు.. సింహాలను రైళ్లు ఢీకొట్టకుండా కాపాడేందుకు రాష్ట్ర అటవీ శాఖ నిర్ణీత వ్యవధిలో ట్రాక్‌పై కంచెలను ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో.. గుజరాత్ హైకోర్టు, అసహజ కారణాల వల్ల ఆసియాటిక్ సింహాలు మృతి చెందడంపై దాఖలైన స్వయంప్రతిపత్తి పిల్‌ను విచారిస్తూ.. రైళ్లలో సింహాలు ఢీకొనకుండా కాపాడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖను కోరింది. కాగా.. 2020 జూన్ లో నిర్వహించిన సింహాల సంఖ్య.. గుజరాత్ లో 674 సింహాలు ఉన్నట్లు తెలిపింది.