వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో నీరు చేరడం వల్ల దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల మలేరియా, డెంగ్యూ మరియు చికున్‌గున్యా వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల.. మీ ఇంటి చుట్టూ దోమలు చేరకుండా నిరోధించడం ఈ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. పరిశుభ్రతతో పాటు.. కొన్ని మొక్కల సహాయంతో దోమలను దూరంగా ఉంచవచ్చు. ఇంట్లో దోమల నివాణ తగ్గించేందుకు కొన్ని మొక్కలు పెంచుకుంటే.. వాటి వ్యాప్తి తగ్గుతుంది. ఆ మొక్కల సువాసన దోమలకు అస్సలు నచ్చదు. ఈ మస్కిటో…
హ్యుందాయ్ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ ఇన్‌స్టర్‌ను దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు హ్యుందాయ్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. కంపెనీకి చెందిన ఈ కారుని ఏ విభాగంలో తీసుకొచ్చారు.? ఇందులో ఎలాంటి ఫీచర్లను అందిస్తున్నారు.? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు నడపగలదు.? భారత్‌కు ఎప్పుడు తీసుకురావచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం. హ్యుందాయ్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఎలక్ట్రిక్ కార్ ఇన్‌స్టర్‌ను పరిచయం చేసింది. ఈ కారు బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షో 2024లో A సెగ్మెంట్ సబ్-కాంపాక్ట్ SUVగా…
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఓ వ్యక్తి వీడియో తీసి దంపతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిజానికి.. ఆ వ్యక్తి చాలాసార్లు సివిల్ సర్వీస్ (PSC) పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్నాడు. కానీ అతను బార్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత అతను డబ్బు సంపాదించడానికి తప్పు మార్గాలను ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి ఓ జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను చిత్రీకరించి, వారిని బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షలు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
యూపీ గోండా జిల్లాలోని కత్రా శివదయాల్‌గంజ్ స్టేషన్ సమీపంలో నాలుగేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి.. అనంతరం చంపేశాడు. ఈ హత్యలో బాలిక సవతి తండ్రి ప్రమేయం కూడా ఉంది. కాగా.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత.. అసలు విషయం బయటపడింది. పోస్ట్‌మార్టం నివేదికలో సాధు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా గుర్తించారు.
తిరుమలలో ఓ భారీ పాము హల్చల్ చేసింది. దాదాపు 7 అడుగులుండే ఓ జెర్రిపోతు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే పాము సంచరిస్తుందని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని భారీ సైజుతో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు తిరిగే డీ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు.
మంత్రి బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద చంద్రబాబు ఉంచిన భాద్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని.. గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని తెలిపారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600…
కరిచింది పెంపుడు కుక్కే కదా అని చేసిన నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయింది. కుక్కకు రాబిస్ సోకిన విషయం తెలుసుకోకపోవడంతో వ్యాక్సిన్ వేసుకోవడంలో ఆలస్యం వల్ల ప్రాణాల మీద తెచ్చుకున్నాడు యువకుడు. ఈ విషాదం విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. తండ్రి నర్సింగరావు ఆర్టీసీలో కండక్టర్ గా పని చేసి గత ఎనిమిదేళ్లుగా పెరాలిసిస్ వచ్చి మంచానికే పరిమితం అయ్యారు. కుమారుడు భార్గవ్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు.
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ పదవికి ప్రధాని నరేంద్ర మోడీ తన పేరును ప్రతిపాదించారు. ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పార్టీలు ఆయన పేరుకు మద్దతు పలికాయి. ఆ తర్వాత.. వాయిస్ ఓటు ద్వారా ఈ పదవికి ఎంపికయ్యారు. మరోవైపు.. కాంగ్రెస్ తరుఫు నుంచి ఎంపి కె. సురేష్‌ను లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా.. ముజువాణీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో.. వరుసగా రెండోసారి స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో..…
యూపీ కౌశాంబిలోని భర్వారీలోని కోఖ్‌రాజ్ హైవేపై సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళ మెడ మొండెం నుంచి విడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళ తలను వెనుక నుంచి వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో.. తల శరీరం నుంచి విడిపోయింది.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం యూపీలోని హర్దోయ్‌లో వెలుగు చూసింది. పోస్ట్‌మార్టం నిర్వహించే రూమ్లో.. చనిపోయిన వ్యక్తి దగ్గర ఏమైనా నగలు కనిపిస్తే వాటిని నొక్కేసి.. వాటి స్థానంలో నకిలీ నగలును పెడుతున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఓ పక్క కుటుంబ సభ్యులు బాధతో ఉంటూ.. పట్టించుకోవడం కరువైంది. ఈ క్రమంలో.. బంగారు నగలను కొట్టేస్తున్నారు. అయితే.. ఎట్టకేలకు వారి బండారం బయటపడింది. ఓ మహిళా కానిస్టేబుల్ సోదరి మృతి చెందడంతో పోస్టుమార్టం రూమ్లో జరుగుతున్న ఈ ఉదాంతం వెలుగులోకి వచ్చింది.