Tirumala: తిరుమలలో భారీ జెర్రిపోతు.. భయంతో పరుగులు తీసిన భక్తులు
- తిరుమలలో భారీ పాము హల్చల్
- తీవ్ర భయాందోళనకు గురైన భక్తులు
- పాము సంచరిస్తుందని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం
- పామును పట్టుకుని అడవిలో వదిలేసిన స్నేక్ క్యాచర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో భారీ కొండ చిలువలు, పాములు సంచరించడం మామూలే. అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చి భయపెడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వర్ష కాలం వచ్చిందంటే.. చల్ల ధనానికి అడవిలో నుంచి జనవాసాల్లోకి వస్తాయి. ఇంతకుముందు.. భక్తులకు పాములు, ఎలుగుబంట్లు, చిరుత పులి కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ భారీ జెర్రిపోతు వీధుల్లోకి వచ్చింది.
Also Read
తిరుమలలో ఓ భారీ పాము హల్చల్ చేసింది. దాదాపు 8 అడుగులుండే ఓ జెర్రిపోతు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే పాము సంచరిస్తుందని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని భారీ సైజుతో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు తిరిగే డీ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు. అయితే.. స్నేక్ క్యాచర్ పామును పట్టుకునే విధానం చూస్తే మనకే భయమేస్తుంది. అలాంటిది అతను ఏ మాత్రం భయం లేకుండా పట్టేశాడు. ఎన్నో ఏళ్లుగా తిరుమల, తిరుపతిలో విష సర్పాల నుంచి భక్తులను రక్షిస్తున్నాడు. టీటీడీ ఉద్యోగిగా పనిచేస్తూ ఇప్పటి వరకు 10వేలకు పై చిలుకు పాములను రెస్క్యూ చేశాడు. రిటైరైనా ఇప్పటికీ టీటీడీలో ఆయన సేవలు అందిస్తున్నారు.
Read Also: Prabhas Fan: ‘కల్కి 2898 ఏడీ’ క్రేజ్.. షాప్ క్లోజ్ చేసిన ప్రభాస్ ఫ్యాన్!
ఇదిలా ఉంటే.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కూడా ఓ పాము కలకలం రేపింది. రోడ్డు పై పార్క్ చేసిన బైక్ లోకి వెళ్లింది. దీంతో.. దానిని చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ పామును బైక్ లో నుంచి బయటకు పంపడానికి అరగంట పాటు శ్రమపడ్డారు. అయితే.. బైక్ నుండి బయటకు రాగానే స్థానికులు పామును చంపేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!