Fatal Accident: బస్సు కిటికీ నుంచి తల బయటకు పెట్టిన మహిళ.. వెనుక నుంచి ట్రక్కు ఢీ
- బస్సు కిటికీ నుంచి తల బయటకు పెట్టిన మహిళ
- వెనుక నుంచి ట్రక్కు ఢీ
- తల.. మొండెం వేరు
- రాజస్థాన్ నుండి 40 మంది భక్తులతో ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వోల్వో బస్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. అజాగ్రత్త, నిర్లక్ష్యంతో రెప్పపాటులో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో చూశాం. అయితే ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. సాధారణంగా మనం బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీల్లో నుంచి చేతులు, తల బయటపెట్టకూడదు అని హెచ్చరిస్తూ బస్సులో రాసి ఉంటాయి. అయితే వీటిని చాలా మంది పట్టించుకోరు. కొందరు వాంతి వస్తుందని, మరికొందరు బయటి ప్రదేశాలను చూడాలనో, ఇంకొందరు అత్యుత్సాహంతో తల, చేతులు బయట పెడుతుంటారు. ఆ క్రమంలో అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం చూశాం. ఇలాంటి ఘటనే యూపీ కౌశాంబిలోని భర్వారీలోని కోఖ్‌రాజ్ హైవేపై సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆ మహిళ మెడ మొండెం నుంచి విడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళ తలను వెనుక నుంచి వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో.. తల శరీరం నుంచి విడిపోయింది.
Gold Rates Today: మగువలకు ‘గోల్డెన్’ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
వోల్వో బస్సు భక్తులతో ప్రయాగ్‌రాజ్ నుంచి మధుర బృందావనం వెళుతోంది. అయితే.. ఈ ప్రమాదంతో మృతురాలి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి రాజస్థాన్ నుండి 40 మంది భక్తులతో వోల్వో బస్సు ప్రయాగ్‌రాజ్ నుండి మధుర బృందావనానికి వెళుతోంది. రాత్రి 2 గంటల సమయంలో కోఖ్‌రాజ్ సమీపంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 ఏళ్ల మహిళ కిటికీలోంచి చూస్తోంది. ఇంతలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఓవర్‌టేక్ చేసిందుకు ప్రయత్నించి. మహిళ తలకు తగులుకుంటూ వెళ్లింది. దీంతో.. శరీరం నుంచి విడిపోయి రోడ్డుపై పడింది.
Pet Dog: పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి.. భీమిలిలో విషాదం
కాగా.. బస్సులో ఆమె పక్కనే కూర్చున్న ఇద్దరి కూతుళ్లు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఉన్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని హోటళ్లలో ఉన్న ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనానంతరం పారిపోతున్న ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన బాలికలను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతురాలి బంధువులకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. అర్థరాత్రి పోలీసులు విచారణ జరిపి మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- bus window
- fatal accident
- head
- HIT
- Truck
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!