ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. నేడు వరంగల్ పర్యటన ఉన్నా.. తన టూర్ ను వాయిదా వేసుకుని హస్తినలోనే ఉన్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సహా.. డిప్యూట సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే…
రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
కొందరు విద్యార్థులతో హీరో విజయ్ ఇంట్రాక్ట్ అయ్యారు. గత ఏడాది తరహాలోనే ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు హీరో విజయ్. తిరువాన్మియూర్‌లోని శ్రీరామచంద్ర కళ్యాణమండపంలో పదో తరగతి నుండి ఇంటర్మీడియట్ పాస్ అయిన సుమారు పది జిల్లాలకు చెందిన విద్యార్థులకు అభినందన, ప్రోత్సాహాన్ని పార్టీ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో.. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెంకాసి, విరుదునగర్, మదురై, పుదుకోట్టై, అరియలూర్, కోయంబత్తూరు, రామనాథపురం, దిండిగల్, శివగంగై, ఈరోడ్, తేని, ధర్మపురి, కరూర్, కృష్ణగిరి, నమక్కల్, నీలగిరి, సేలం ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.…
కర్ణాటకలోని హవేరి జిల్లా బైడ్గి తాలూకాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును మినీ బస్సు ఢీకొనడంతో కనీసం 13 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలోని మృతులు శివమొగ్గ వాసులుగా గుర్తించారు. బెళగావి జిల్లా సవదత్తి నుంచి యల్లమ్మ దేవిని దర్శించుకుని తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మరోవైపు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని.. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు…
అమెరికా, వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికాతో టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జోడీ మొత్తం 6 వికెట్లు పడగొట్టింది. దీంతో.. సెమీస్‌లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించగలిగింది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్‌పై టీమ్ ప్లాన్ గురించి భారత కెప్టెన్…
మెదక్ జిల్లా వడియారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట(మం) వడియారం బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని అతివేగంతో వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో.. లారీ క్యాబిన్లో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి మేకల లోడుతో హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. కాగా.. క్షతగాత్రులకు తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో.. ఈరోజు వరంగల్ పర్యటన రేపటికి వాయిదా పడింది. నేడు జరగాల్సిన కార్యక్రమాలు యధావిధిగా రేపటికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం వరంగల్‌లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1:30కి టెక్స్‌టైల్ పార్క్‌కు చేరుకుని, అనంతరం 2:10కి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించాల్సి ఉంది. ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరపాల్సి ఉంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి…
భారత స్పిన్నర్ల మాయాజాలంతో టీ20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించడానికి రంగంలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ చేతులెత్తేయడంతో 16.3 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో.. టీమిండియా ఫైనల్స్కు చేరింది. ఈ ఆనందంలో రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో.. భారత్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. 68 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 16.4 ఓవర్లలోనే ఇంగ్లండ్ను 103 పరుగులకు ఆలౌట్ చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ బౌలర్ల ధాటికి తడబడ్డారు. కేవలం జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్ ఈ ముగ్గురే 20 పరుగుల మార్కును దాటారు. మిగతా వాళ్లంతా తక్కువ…
పర్యావరణం పట్ల నిరంతరం అవగాహన పెరగడం.. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల సీఎన్జీ (CNG) కార్లకు డిమాండ్ పెరిగింది. ఎంట్రీ లెవల్ కార్ల నుండి పెద్ద ఫ్యామిలీ ఎమ్‌పివిల వరకు ప్రస్తుతం సిఎన్‌జి ఇంధన ఎంపికతో అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లలో సీఎన్జీ కార్లకు నిరంతరం పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. వాహన తయారీదారులు అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో మారుతి సుజుకి స్విఫ్ట్ S-సీఎన్జీ నుండి టాటా నెక్సాన్ i-సీఎన్జీ కార్లు ఉన్నాయి.