Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉచిత పథకాలపై మాట్లాడిన ఆయన, ప్రజలు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..”నేను సాధారణంగా స్వేచ్ఛగా మాట్లాడే వ్యక్తిని. కానీ ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నందున నా నోటికి ప్లాస్టర్ వేసినట్లుగా ఉంది. ఏదైనా పొరపాటున మాట్లాడితే ‘స్పీకర్ హోదాలో ఉండి ఇలా మాట్లాడారు’ అంటూ వివాదం సృష్టిస్తారు. అలా జరిగితే నాకు ఉన్న పదవి కూడా పోతుంది” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. కేరళ ప్రజలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడ ప్రజలు అభివృద్ధిలో చురుకుగా పాల్గొంటారని, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఉచిత పథకాలు ఏమి వస్తాయనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అంశంపై కూడా స్పీకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేరళలో ప్రజలు పెద్దఎత్తున మొక్కలు నాటుతారని, మన రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక చెట్టైనా నాటాలని పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ మొక్కలు నాటడం కంటే చెట్లను నరికివేయడంపైనే ఎక్కువ దృష్టి కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే రాష్ట్రం మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుందని అన్నారు.
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
రాజకీయాలపై కూడా అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలే జరుగుతున్నాయని, అభివృద్ధి అంశాలపై చర్చలు తక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు